సుకుమార్‌తో ప్రభాస్ మూవీ.. తెలంగాణ నేపథ్యంలో విప్లవాత్మక కథ! ఓకే చెప్పిన డార్లింగ్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఏ స్థాయిలో స్టార్ డమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే ఆయన పలు ప్రాజెక్ట్సుతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక లెక్కల మాస్టార్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కు కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
ఆయన సినిమాలంటే ఇష్టపడే ప్రేక్షకులు ఎందరో. ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని ఎవ్వరూ.. ఎప్పుడూ ఏమాత్రం ఊహించలేదు. కానీ ఊహలకు మించి అన్నట్లుగా ఈ క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందనే ఓ వార్త మాత్రం తెగ హడావిడి చేస్తుంది.

మ్యాన్లీ లుక్: దివంగత నటుడు కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. తన నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటికి మించి మ్యాన్లీ లుక్ తో అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. యంగ్ రెబల్ స్టార్ గా క్రేజ్ అందుకున్న ప్రభాస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే.

యంగ్ డైరెక్టర్ తో: బాహబలి రెండు భాగాల బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నుంచి అన్ని సినిమాలను భారీగానే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో సాహో, రాధా క్రిష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధేశ్యామ్ చిత్రాలు చేశాడు ప్రభాస్. అయితే అవి ఊహించినంత స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ నిరుత్సాహపడ్డారు. ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

6 అలా.. మరొకటేమో: ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా టీజర్ ను వదలగా దానిపై తెగ ట్రోలింగ్ జరిగింది. ఇక ఇటీవల విడుదల చేసిన జై శ్రీరామ్ లిరికల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అప్పటివరకు ఆదిపురుష్ పై ఉన్న నెగెటివిటీ తొలిగిపోతుందని టాక్ వినిపిస్తుంది. కాగా ప్రభాస్ ఆదిపురుష్ తో పాటు మరో ఐదు సినిమాలను లైన్ లో పెట్టగా.. మరొకటి కథ ఫైనలైజ్ అయిందని సమాచారం.

క్రేజీ ప్రాజెక్ట్స్: కేజీఏఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మారుతితో హారర్ కామెడీ చిత్రంగా 'రాజా డీలక్స్' (ప్రచారంలో ఉన్న టైటిల్) ఉన్నాయి. అలాగే పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో మైత్రీ మూవీ మేకర్స్ మూవీ. ఇటీవలే బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియాతో ప్రభాస్ మూవీకి స్టోరీ ఫైనలైజ్ అయిందని టాక్ వినిపిస్తోంది.

స్క్రిప్ట్ మీద వర్క్: అయితే ప్రభాస్ తో సుకుమార్ ఓ సినిమా చేసేందుకు సన్నాహాల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో రజకార్ల నేపథ్యంలో విప్లవాత్మక కథగా సుక్కు స్టోరీ రెడీ చేశాడట. కొద్ది రోజులుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన సుకుమార్ పుష్ప 2 తర్వాత ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తాడట. ఈ కథకు ప్రభాస్ కూడా ఓకే చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయ్ మూవీ వెనక్కి: ఇక విజయ్ దేవరకొండతో అనౌన్స్ చేసిన సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లకపోవచ్చని, ప్రభాస్ సినిమానే ముందు తెరకెక్కే అవకాశం ఉందని టాక్. ఈ మధ్య ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి వీటిలో ఎంత నిజముందనేది.


Click it and Unblock the Notifications











