ప్రభాస్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. ఆ సినిమాకు సీక్వెల్?
బాహుబలి సినిమాతో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా అదే తరహాలో ఉంటాయి అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. సాహో సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వకపోయినప్పటికీ ప్రభాస్ ఓపెనింగ్స్ అయితే గట్టిగానే అందుకున్నాడు. బాహుబలి అనంతరం ప్రభాస్ వీలైనంత వరకు పెద్ద సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి చిన్న సినిమాలను కూడా చేయాలని అనుకున్నాడు.
కొన్నిసార్లు వందకోట్ల మార్కెట్ దాటకుండా చూసుకోవాలి అని కూడా ప్లాన్ చేసుకున్నాడు. కానీ అన్నీ అనుకున్నట్లుగా జరగ లేదు. ఎందుకంటే ప్రభాస్ మార్కెట్ ఇప్పుడు మామూలుగా లేదు. అతని దగ్గరికి వస్తున్నా దర్శకులు నిర్మాతలు కూడా అతి పెద్ద కథలను తీసుకువస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు అని ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాడు.
ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమానే చేస్తూ వచ్చిన ప్రభాస్ ఈ సారి వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టడం ఆశ్చర్యమే అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ లైన్ లో పెట్టిన ఒక సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

అయితే ఈ కథకు దర్శకుడు ఇప్పటికే సీక్వెల్ పాయింట్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఫైనల్ అవుట్ మరికొన్ని రోజుల్లో సిద్ధమవుతుంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చూసిన ప్రభాస్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యలో కొన్ని సీన్స్ మంచిగా రాలేవు అనే కారణంతో రీ షూట్ చేసినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రభాస్ రాధాకృష్ణ చెప్పిన సీక్వెల్ పాయింట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సీక్వెల్ ను పూర్తిగా సిద్ధం చేసిన తరువాత మరొకసారి చెప్పాలని కూడా అన్నాడట. అయితే రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కించడానికి రాధాకృష్ణ చాలా సమయం తీసుకున్నాడు. అసలు అప్డేట్స్ ఇవ్వడంలో కూడా చాలా నెమ్మదిగా వెళ్ళడం ఓ వర్గం అభిమానులను కూడా తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.. ముఖ్యంగా యువి క్రియేషన్స్ లో అయితే మరో సినిమా చేయకూడదని ప్రభాస్ అభిమానులు కామెంట్స్ కూడా చేశారు.
ఏదేమైనప్పటికీ రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ పై చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా ప్రస్తుతం నమ్మకంతోనే ఉన్నారట. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కూడా అంటున్నారు. ఇది వరకే విడుదలైన టీజర్ కూడా మంచి క్రేజ్ అందుకుంది. పాన్ ఇండియా టీజర్ లలో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న టీజర్ గా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరి సినిమా ఫైనల్ గా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











