Project K: ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందంటే.. సైలెంట్ గా హింట్ ఇచ్చేశారుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెట్టిన ఏకైక హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డార్లింగ్ ఎలాంటి సినిమాలు తెరపైకి తీసుకు వచ్చినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి. గతంలో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ తరహాలో కాకుండా ప్రభాస్ ఎంచుకునే ప్రతి కథ కూడా ఎంతో కొంత భిన్నంగా ఉండాలి అని చూసుకుంటున్నాడు.

ఇక అన్ని సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు Kపై కూడా ప్రేక్షకుల్లో అంచనాల స్థాయి ఆకాశాన్ని దాటేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తున్నా చిత్ర యూనిట్ కూడా ఇన్ డైరెక్ట్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.

నార్త్ లోనే ఎక్కువగా..

నార్త్ లోనే ఎక్కువగా..

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే అందుకుంది. నార్త్ లో ప్రభాస్ రేంజ్ కూడా పెరిగిపోయినట్లు చాలా ఈజీ గా అర్థమైంది. చూస్తుంటే భవిష్యత్తులో చాలా సినిమాలు సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువగా సంచలనం సృష్టించే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది.

విభిన్నమైన సినిమాలు

విభిన్నమైన సినిమాలు

రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని భాషల్లోనూ విడుదల అవుతాయని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రభాస్ బాహుబలి అనంతరం అంతకు మించి అనేలా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా హిస్టారికల్ కథలతో పాటు డిఫరెంట్ అడ్వెంచర్ సినిమాలను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రాజెక్ట్ K అయితే సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు ఇదివరకే దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా ఒక క్లారిటీ ఇచ్చాడు.

ప్రభాడ్ పాత్రపై క్లారిటీ ఇచ్చినట్లే..

ప్రభాడ్ పాత్రపై క్లారిటీ ఇచ్చినట్లే..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు K ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే ప్రభాస్ కూడా ఈ సినిమాతోనే ఇక నుంచి బిజీ కానున్నాడు. శనివారం డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రభాస్ పాత్రపై కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లు అర్థమవుతోంది. సినిమాకి కొత్త ఆకారాన్ని తీర్చిదిద్దిన సూపర్ హీరో అంటూ.. హ్యాపీ బర్త్‌డే రెబల్ స్టార్ ప్రభాస్. మీరు ప్రాజెక్ట్ K సెట్స్‌లోకి వస్తారని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

సూపర్ హీరోగా..

సూపర్ హీరోగా..

ఈ సినిమాలో ప్రభాస్ ఒక సూపర్ హీరో గా కనిపిస్తాడని ఇండస్ట్రీలో ఒక టాక్ అయిన వస్తోంది ఇక ఇప్పుడు ప్రభాస్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన విధానంలో చిత్ర నిర్మాణ సంస్థ మరోసారి సూపర్ హీరో అని సంబోధించింది. దీంతో అభిమానులు కూడా సూపర్ హీరోగా ప్రభాస్ ను పవర్ఫుల్ గా చూపించబోతున్నట్లు చెప్పకనే చెప్పేశారు అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X