ప్రభాస్ కు అస్వస్థత.. ఆగిపోనున్న ఆ సినిమాలు.. మళ్లీ అభిమానులకు నిరాశే!
దివంగత కష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ ఎదిగాడు. ఆ సినిమా నుంచి ప్రభాస్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ అలరిస్తున్నాడు. అయితే బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ అంతగా సక్సెస్ తేలేకపోయాయి. దీంతో ప్రభాస్ తర్వాత సినిమా విడుదల, దాని హిట్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డార్లింగ్ అభిమానులు నిరాశ చెందేలా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఎంటర్టైన్ చేస్తూ..
పెద్ద సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు ప్రభాస్. సుధీర్ఘకాలంగా తెలుగులో సత్తా చాటుతున్న ప్రభాస్.. దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ సత్తా చాటుతున్నాడు ప్రభాస్.

కాంట్రవర్సీ క్రియేట్..
బాహుబలి సినిమాల తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్ కు ఆశించినంతగా విజయం దక్కపోవడంతో ప్రభాస్ తర్వాత సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ పై యావత్ సినీ ప్రేక్షకులు పెదవి విరిచారు. డైరెక్టర్ చెప్పిన దానికి చూపించిన ఔట్ పుట్ కు ఎలాంటి సంబంధం లేదని అసహనం వ్యక్తం కాగా.. నటీనటుల వేషధారణపై కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది.

మొత్తంగా ఆరు సినిమాలు..
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఆదిపురుష్ తో పాటు మరో ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మారుతితో హారర్ కామెడీ చిత్రంగా 'రాజా డీలక్స్' ఉండగా.. ఇటీవలే మరో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత యెర్నేని నవీన్ తెలిపారు. దీంతో ప్రభాస్ చేతిలో మొత్తంగా ఆరు సినిమాలు ఉన్నాయి.

అస్వస్థకు గురి..
అయితే ప్రభాస్ చేతిలో మొత్తగా ఆరు6 సినిమాలు ఉండగా.. వాటిలో 6 నెలల గ్యాపులో 3 సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. దీంతో అభిమానులు తెగ ఖుషీ అయిపోయారు. అయితే ఇప్పుడు అలా సంతోషించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా ప్రభాస్ అస్వస్థకు గురయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ అస్వస్థకు గురి కావడం అంటు మేకర్సే కాకుండా అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

చిత్రీకరణకు విరామం..
ప్రభాస్ అస్వస్థత కారణంగా సినిమా చిత్రీకరణలపై ప్రభావం పడనుంది. మూవీ షూటింగ్ లపై ఎఫెక్ట్ పడితే వాటి విడుదల విషయంలో కూడా జాప్యం జరగనుంది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. కాబట్టి ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి ప్రభావం పడకపోవచ్చు. కానీ సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమాల షూటింగ్ కు మాత్రం బ్రేక్ పడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. గత నెలలో ప్రభాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కున్నాడని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రభాస్ ఆరోగ్యం గురించి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.

పూర్తిగా కోలుకున్నాకే..
ఇప్పుడు మరోసారి ప్రభాస్ అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆసుపత్రికి వెళ్లిన ప్రభాస్ వైద్యుల సలహా మేరకు షూటింగ్స్ కి బ్రేక్ విరామం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్. ఇప్పటికే కమిట్ అయిన షెడ్యూల్స్ అన్నింటిని రద్దు చేశారట. మళ్లీ షూటింగ్స్ లో పాల్గొనేందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే షూటింగ్ లో జాయిన్ అవ్వాలని భావిస్తున్నారట.

అభిమానులకు నిరాశే..
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ ఇదే నిజం అయితే ఇప్పటికే విడుదల తేదీలు ఫిక్స్ అయిన ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు మాత్రమే కాకుండా మారుతి దర్శకత్వంలోని సినిమా ఆఖరి షెడ్యూల్ ను ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేయాలనుకున్నారు. అది కూడా ఆగిపోనుంది. ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ కు మళ్లీ తీవ్ర నిరాశే మిగిలినట్లయింది.


Click it and Unblock the Notifications











