పడక గదికి రాలేనని నిర్మాతకు షాకిచ్చిన హీరోయిన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే అంటూ

'పంచాయత్ 3' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగానే వస్తోంది. అలాగే 'పంచాయతీ 3' సెక్రటరీ, ప్రధాన్ జీ పాత్రల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సిరీస్‌లో రింకీ స్నేహితురాలు రవీనా నటనను ప్రజలు కూడా అభినందిస్తున్నారు. అయితే రవీనా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయట పెట్టింది. మరి రవీనా కన్నీరు మున్నీరుగా విలపించే విధంగా సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం పదండి.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రవీనా పాత్రను పోషించిన ఆంచల్ తివారీ తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అని వెల్లడించింది. తన కెరీర్ ప్రారంభ రోజుల్లో తనకు టీవీ సీరియల్ ఆఫర్ ఎలా వచ్చిందో ఈ సందర్భంగా వివరించింది. ఆంచల్ తివారీ మాట్లాడుతూ 'నన్ను కాంప్రమైజ్ కావాలని అడిగారు. ఆ సమయంలో నేను కొత్తగా ముంబైకి వచ్చాను' అని చెప్పుకొచ్చారు.

Panchayat 3 Actress Aanchal Tiwari reveals bitter experience of Casting Couch

నేను 2018లో ముంబైకి వచ్చాను. మొదట్లో కాంప్రమైజ్ అంటే ఏంటో నాకు తెలియదు. అయితే నువ్వు టీవీ సీరియల్ కి సెలెక్ట్ అయ్యావు, రావాలి అని చెప్పగానే. మరుసటి రోజు ఒప్పందంపై సంతకం చేయడానికి నేను బయల్దేరాను. అయితే అంతలోపే అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ కావలసి ఉంటుందని నాకు సందేశం వచ్చింది.

కానీ దాని అర్థం తెలియక నా స్నేహితుడిని అడిగాను. అతను నాకు అర్థమయ్యేలా చెప్పాడు. దీంతో ఆ ఆఫర్ ను నేను నిరాకరించాను, చాలా ఏడ్చాను. కానీ ముంబైలో ఇదంతా సహజమని నా స్నేహితురాలు వివరించింది. అయితే ముంబై ఇలా ఉంటుందని విన్నాను. కానీ అది నాకు జరిగినప్పుడే వాస్తవాన్ని గ్రహించాను. ఇక్కడ మీ స్వంత రూల్స్ పెట్టుకుని పని చేయడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది.

Panchayat 3 Actress Aanchal Tiwari reveals bitter experience of Casting Couch

అలాగే ఆ తరువాత ఆఫర్లు కరువవయ్యాయని ఆవేదనను వ్యక్తం చేసింది. కానీ 2022 సంవత్సరంలో విడుదలైన 'పంచాయత్ 2' రిలీజ్ అయ్యాక ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'పంచాయతీ'లో పనిచేసిన తనకు ఇప్పుడు చాలా ఆఫర్లు వస్తున్నాయని ఆంచల్ చెప్పింది. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌ల నుంచి యాడ్స్ వరకు ఆఫర్లు రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

ఆంచల్ తనది ఉమ్మడి కుటుంబమని, తన ఇంట్లో చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పి, ఏదో ఒకవిధంగా 2014 లో థియేటర్ కోసం ఆడిషన్ చేసి తన కుటుంబాన్ని ఒప్పించింది. ఆ తర్వాత ఆంచల్ అనేక యాడ్స్ లో పని చేసింది,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X