బ్రహ్మానందం సీన్స్ పెంచమని హీరో ఒత్తిడి?

By Srikanya

హైదరాబాద్: స్టార్ హీరోలతో సమానంగా బ్రహ్మానందం హవా నడుస్తోంది. ఆయన తెరపై రాగానే జనం రెస్పాండ్ అయ్యే విధానం చూస్తున్న దర్శక,నిర్మాతలు బ్రహ్మీ డేట్స్ చూసుకునే తమ చిత్రాలను ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా సినిమా ప్రారంభం రోజే హీరో,హీరోయిన్స్ గురించి చెప్పటం కన్నా బ్రహ్మానందం కామెడీ హైలెట్ అని పబ్లిసిటీ ప్రారంభించేస్తున్నారు. తాజాగా రామ్ చిత్రం ఓపినింగ్ లోనూ అదే జరిగింది. బ్రహ్మానందం విషయం హైలెట్ చేస్తూ దర్శకుడు మాట్లాడారు. హీరో,హీరోయిన్ లకు బ్రహ్మానందం కాంబినేషన్ లో సీన్స్ ఉంటే పాసైపోవచ్చనే ధీమా కనపడింది.

దానికి కారణం రామ్ వరస ఫ్లాఫులతో దూసుకు వెళ్లటమే అంటున్నారు. బ్రహ్మానందం తనను ప్లాఫ్ ల నుంచి కాపాడతాడని రామ్ భావించి, ఆ సీన్స్ పైనే ఎక్కువ కాన్సర్టేట్ చేసేలా దర్శకుడుపై ఒత్తిడి తెచ్చాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇలా బ్రహ్మానందం సీన్స్ పెంచమని దర్శక,రచయితలకు పురమాయించంటం ఈ మధ్య కాలంలో దాదాపు అందరు పెద్ద హీరోల సినిమాలకు జరుగుతోందంటున్నారు. రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పండగ చేస్కో' సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత.

Pandaga Chesko: Brahmanandam will be seen in a prominent role

దర్శకుడు మాట్లాడుతూ ''రామ్‌ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్‌ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. హీరో,హీరోయిన్స్, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు. రామ్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా చిత్రబృందం ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

''రామ్‌తో సినిమా చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు పరుచూరి ప్రసాద్‌. చిత్రంలో సాయికుమార్‌, రావు రమేష్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: తమన్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X