బాలీవుడ్ కి బాలకృష్ణ...

By Staff

Pandurangadu
అవును ...ఇప్పుడు బాలకృష్ణ బాలీవుడ్ తెరపై కన్పించనున్నాడు. అదెలాగంటే పాండురంగడు హీందీలోకి డబ్బింగ్ అవబోతోంది. బాలకృష్ణ, టాబు, స్నేహ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోని ప్రధాన పాత్ర పుండరీక రంగనాథుడిది మహారాష్ట్రలోని పండరీపురం. అందువల్ల హిందీలో అనువాదమైతే మరాఠీలు ఈ సినిమాను బాగా ఆదరిస్తారని రాఘవేంద్రరావు భావిస్తున్నారు. ఈ సినిమాను ఆయన సొంత నిర్మాణ సంస్థ ఆర్‌కే అసోసియేట్స్ నిర్మించింది. పైగా టాబుకి బాలీవుడ్‌లో చక్కని ఆదరణ వుంది. ఈ సినిమాలో బాలకృష్ణ తర్వాత ఎక్కువమందిని ఆకట్టుకున్నది ఆమె పాత్రే. అమృత అనే వేశ్య పాత్రలో ఆమె చేసిన స్కిన్ షో మహిళలకి ఇబ్బంది కలిగిస్తే యువతకు కిర్రెక్కించింది. దీన్ని సొమ్ము చేసుకోవాలని కూడా రాఘవేంద్రరావు ఆశిస్తున్నారు.

దర్శకుడు కె రాఘవేంద్రరావు ఇదివరకు రూపొందించిన భక్తి చిత్రాల్లో 'అన్నమయ్య' హిందీలో అనువాదమై, హిందీ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు ఆయన మరో చిత్రం 'శ్రీరామదాసు' హిందీలో 'శ్రీరామమందిర్' అనువాదమైంది. త్వరలో విడుదల చేయడానికి నిర్మాత కొండా కృష్ణంరాజు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆయన తాజా చిత్రం 'పాండురంగడు'ను కూడా హిందీలో అనువదించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదలా ఉంచితే గతంలో 'అల్లరిపిడుగు' చిత్రాన్ని హిందీలోకి అప్పట్లో డబ్బింగ్ అయింది .అప్పుడు ముంబాయి లో రిలీజయినప్పుడు బాలయ్యది చిన్న ఫొటో వేసి హీరోయిన్ కత్రినాకైఫ్ ది ఫుల్ పోస్టర్స్ వేసి పబ్లిసిటీ చేసారు . దాంతో ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా అని అభిమానులు కలవరపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X