'పంజా'తో పాటే మహేష్ కూడా ధియేటర్స్ లోకి...
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా ఈ నెల తొమ్మిదివ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు మహేష్ ది బిజినెస్ మ్యాన్ ట్రైలర్స్ ని కూడా ధియోటర్స్ లో ప్రదర్శించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ట్రైలర్స్ లో మహేష్,కాజల్ లిప్ టు లిప్ కిస్ బిట్ కూడా ఉండే అవకాశం ఉందని,అది క్రేజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ లిప్ టు లిప్ కిస్ సీన్ ముందు బెంచ్ వాళ్లని ఎట్రాక్ట్ చేయటానికి తీస్తున్నారా అని ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వారు సినిమా యూనిట్ ని అడిగినప్పుడు వారు అలాంటిదేమీ లేదు..అలాంటి మూవ్ మెంట్ కు సినిమాలో ప్రాధాన్యత ఉంది. పూరీ జగన్నాధ్ ఆ మూవ్ మెంట్స్ ని చాలా జాగ్రత్తగా కాప్చర్ చేసి సినిమాలో హైలెట్ గా ప్రెజెంట్ చేస్తున్నారు అన్నారు. ఇక ఆ సన్నివేశంలో కాజల్ పడుకుని ఉంటే మహేష్ వచ్చి ముద్దు పెట్టుకుంటాడు.
నిద్రలో ఆమె అమాయికమైన ఫేస్ ని చూసి మహేష్ టెమ్ట్ అవుతాడని చెప్తున్నారు. ఇక పంజాతో పాటు ఈ చిత్రం ట్రైలర్స్ ని విడుదల చేయటంతో ఎక్కువ మందిని ఈ ట్రైలర్స్ రీచ్ అయ్యే అవకాసం ఉందని చిత్రం యూనిట్ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ చిత్రమూ విడుదల కానన్ని ధియోటర్స్ లో పంజాని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో దూకుడు చిత్రమే ఎక్కువ ధియోటర్స్ లో విడుదల చేసి రికార్డు క్రియేట్ చేసింది. దాన్ని పంజా బ్రద్దులు కొట్టే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











