‘పంజా’ను అడ్డుకొంటున్న మహేష్ ‘బిజినెస్’...!?
మహేష్ బాబు ఇప్పుడు చాలా మారాడు. దూకుడు సక్సెస్ తో అతనిలో ఈ మార్పు వచ్చిందంటున్నారు సినీ వర్గాల వారు. ఎందుకంటే ఇంతకు ముందెన్నడూ రికార్డుల గురించి కానీ, సెంటర్స్ గురించికాని, తన షూటింగ్ పూర్తి చేసుకొన్న సినిమా గురించి కాని ఎప్పుడు ఆలోచించేవాడు కాదు. అవన్నీ దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లే చూసుకొనేవారు. అయితే ఇప్పుడు అందుకు బిన్నంగా మహేష్ మారారంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు మగదీరని దూకుడుని క్రాస్ చేసిందని ట్వీట్ చేయడం అదికాస్త పెద్ద ఇష్యూ అవ్వడం పెద్ద రబసే జరిగింది. అయితే ఇప్పుడు అదే దూకుడు ని కొనసాగిస్తూ వందరోజుల వరకూ రన్ చేయాలని అదే థియేటర్లు బిజినెస్ మ్యాన్ సినిమాకి కావలని థియేటర్ల విషయంలో పోటిపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ పంజా సినిమాకి కొన్ని ఏరియాల్లో మంచి థియేటర్లు దొరకడం లేదు. అందుకు కారణం దూకుడు సినిమాని కావాలని వంద రోజులకి లాగడమే..నిజానికి దూకుడు చాలా ఏరియాల్లో ఎప్పుడో డెఫిసిట్ లో పడింది. అయినా కానీ ఈ సినిమాని వంద రోజులు ఆడించేందుకు బయ్యర్లు కట్టుబడ్డారు. తను చెప్పుకున్న ఫేక్ రికార్డులతో సంతృప్తి పడక ఇలా సినిమాని కావాలని డ్రాగ్ చేస్తూ మహేష్, దూకుడు నిర్మాతలు వేరే సినిమాల పాలిట ఇబ్బందిగా పరిణమించారు. దూకుడు తర్వాత అవే థియేటర్లలో బిజినెస్ మ్యాన్ సినిమా వేయడానికి ఒప్పందాలు ఏనాడో జరిగిపోయాయి.
కానీ బిజినెస్ మ్యాన్ రావడానికి ఇంకా నాలుగు వారాల పైగానే సమయం ఉంది. ఈలోగా మంచి థియేటర్లు దొరికితే 'పంజా'లాంటి సినిమాలకి లాభం ఉంటుంది. కానీ హీరో, నిర్మాతల రికార్డుల పిచ్చి కారణంగా ఆ సినిమా నష్టపోతోంది. మహేష్ కి ఇప్పుడు సడన్ గా రికార్డుల మీద ఇంత మోజెందుకో అతనికే తెలియాలి.


Click it and Unblock the Notifications











