దిల్ రాజు కి పవన్ పంజా దెబ్బ చూపించిన దాసరి సిరిమీడియా...!

By Sindhu

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ వండర్ 'పంజా". పవన్ కళ్యాణ్ న్యూలుక్ తో కనిపిస్తున్న ఈ చిత్రంపై అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతోంది. విడుదలకు ముందే అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ చిత్రం ఆడియో ఈనెల 19న గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ గా జరగనున్న విషయం విధితమే. డిసెంబర్ 9న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా నైజామ్ రైట్స్ విషయంలో తీవ్ర పోటీ ఏర్పడింది.

పవన్ కళ్యాణ్ పంజా బిజెనెస్ ఓ రేంజిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9 న విడుదల కానున్న ఈ చిత్రం బిజెనెస్ ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా చేయని బిజెనెస్ చేస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి ఫస్ట్ లుక్ విడుదల అయ్యేవరకూ అస్సలు బిజెనెస్ ఎంక్వైరీలు జరగలేదు.కానీ ఫస్ట్ లుక్ ,టీజర్ విడుదల అయ్యాక వస్తున్న ట్రేడ్ ఎంక్వైరీలు నిర్మాతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు చెప్తున్నారు.

ముందు ఈ చిత్రం నైజామ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. ఆల్ మోస్ట్ 'పంజా" చిత్రం నైజామ్ రైట్స్ అతనికే ఓకే కానున్నాయన్న టైమ్ లో దాసరినారాయణరావుకు చెందిన సిరిమీడియా చక్రం తిప్పి 'పంజా" నైజామ్ రైట్స్ ని 'ఎన్ ఆర్ ఎన్ (నాన్ రఫండబుల్ అమౌంట్)కింద 8.2కోట్లకు దక్కించుకుంది. ముందు 14కోట్లకు ఎన్ ఆర్ ఎ లేకుండా ఇవ్వాలనుకున్న నిర్మాతలు చివరికి సిరిమీడియాకు సరెండర్ అయిపోయారని తెలుస్తోంది. ఈ వార్తతో 'పంజా" ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించడం మొదలు పెట్టిందని అంతా ఇండస్ట్రీ వర్గాలు చెబుతుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X