For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జల్సా రేంజ్ లో బ్రహ్మానందం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్...!

  By Sindhu
  |

  ఎప్పుడు..ఎప్పుడాని ఎదరుచూస్తోన్న పవన్ కళ్యాణ్ 'పంజా" చిత్ర ఆడియో ఆవిష్కరణ తేదీ ఖరారైంది. నవంబర్ 19 వ తేదీన ఈ వేడుకను కళ్ళు మిరుమిట్లు గొలిపేలా తీర్చి దిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది.

  కాగా, ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తున్న ఓ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, పంజాలో పవన్ కళ్యాణ్ ఓ చిన్న సెటైరికల్ సాంగ్ పాడినట్టు వినికిడి. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఏమీ లేదు. మొత్తంగా ఈ వార్త అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. తెలుగులో ఏ హీరో సినిమా అయినా సరే అందులో కామెడీకి మాత్రం బ్రహ్మి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. హీరో క్యారక్టరైజేషన్ కోసం దర్శకులు ఎంతగా తపిస్తున్నారో, బ్రహ్మి క్యారక్టర్ కోసం కూడా డైరక్టర్లు కూడా అంతగానే ట్రై చేస్తున్నారు. బాబీ, గచ్చి బౌలి సుధాకర్, ప్రణవ్,… ఇలా చెప్పుకుంటూ పొతే బ్రహ్మి ఎన్ని రకాలుగా నవ్వించాలో అంతగానూ నవ్విస్తున్నాడు. ధియేటర్లో హీరో ఇంట్రడక్షన్ సీన్ కు ఎంతగా విజిల్స్ వినిపిస్తున్నాయో బ్రహ్మి ఎంట్రీకి కూడా అంత కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ పంజా లో కూడా బ్రహ్మి రోల్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది.

  ఇందులో బ్రహ్మానందాన్ని పొగుడుతూ పవన్ కళ్యాణ్ ఓ పాట కూడా పాడే సీన్ ఉంటుందట. ఈ పాటను సింగర్ హేమ చంద్ర ఇప్పటికే పాడటం పూర్తి చేసినట్టు తెలుస్తుంది. బ్రహ్మిని పొగుడుతూ పవన్ పాట అంటేనే ఊహించుకోవచ్చు. సీన్ ఎంత ఫన్నీగా ఉంటుందో…, ఈ పాట పిక్చరైజేషన్ కూడా పవన్ స్టైల్ లో ఉంటుందని సమాచారం. గతంలో పవన్ జానీ సినిమాలో నువ్వు సారా తాగుటు మాను లింగం అనే పాటను ఎం. ఎస్ నారాయణ పై షూట్ చేసిన సంగతి తెలిసిందే. పంజాతో ఆ ఛాన్స్ బ్రహ్మికి వచ్చింది.సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ మోతాదు అధికంగా ఉండనుందట. పుష్కలమైన కామెడి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉంటాయని సమాచారం.

  భారీ అంచనాలు నెలకొన్న 'పంజా" సినిమా డిసెంబర్ 9 న ప్రపంచావ్యప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సారాజైన్, అంజలి లవనియా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకత్వం విష్ణు వర్ధన్. శోభు యార్లగడ్డ , నీలిమ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ జనాల్లో సంచలనం రేకెత్తించిన విషయం విదితమే.

  English summary
  Power star Pawan Kalyan's upcoming movie Panjaa having more surprises for mega fans. Sources say that a special small song was composed on comedy king Bramhanandam. This song would have a different trend of comedy, which will make audience to laugh in theaters. Panjaa movie completed its shooting schedules and is currentyly undergoing post production. Panjaa music launch is scehduled on November 19 at Gacchi Bowli indoor stadium, Hyderabad while the movie is hitting the screen on December 9.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X