పంజా ఆడియోలో ‘దూకుడు’ను బ్లేమ్ చేసే ప్లాన్?
మెగా అభిమానులు, మహేష్ బాబు అభిమానుల మధ్య గత కొన్ని రోజులగా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న విబేదాలు ఇటీవల రోడ్కెక్కాయి. దూకుడు సినిమా రికార్డులు ఫేక్ రికార్డలు అనే విధంగా కౌంటర్ ఇస్తూ... మగధీర రికార్డులను బీట్ చేసే సినిమా ఇంత వరకు తెలుగులో రాలేదు అని వివరిస్తూ ఏయే సెంటర్లలో మగధీర ఎంత కలెక్షన్లు సాధించాయనే పూర్తి వివరాలతో బ్యానర్ ఏర్పాటు చేశారు మెగా అభిమానులు.
అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా మగధీర సినిమానే ఇప్పటి వరకు నెం.1, దూకుడు సినిమా మంచి కలెక్షన్లతో సాగుతున్నప్పటికీ మగధీరను అందుకోలేక పోయిందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా. మెగా ఫ్యామిలీ అండ్ అభిమానులు ఇంతటితో ఆగేట్లు కనిపించడం లేదు. త్వరలో జరుగబోయే పవన్ కళ్యాణ్ 'పంజా" ఆడియోలో.....మరోసారి మగధీర రికార్డల గురించి మాట్లాడేందుకు ప్లాన్ చేస్తున్నారట. మగధీర రికార్డులను బద్దలు కొడితే గిడితే 'పంజా"సినిమా మాత్రమే కొట్టగలదని స్టేట్మెంట్ ఇచ్చేందుకు అల్లు అరవింద్ ప్రిపేర్ అవుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
పరిశ్రమలో నెం.1 స్థానాన్ని కోల్పోకూడదనే గట్టి పట్టుదలతో ఉన్న మెగా కుటుంబం.....దూకుడు రికార్డులు తమను అధిగమించలేక పోయిందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరి ఈ సినిమా వార్ ఎంత వరకు వెలుతుందో వేచి చూడాలి.
పంజా ఆడియో ఈ నెల 19న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ సరసన సారా జేన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తుండగా తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంఘ మిత్ర ఆర్ట్స్, ఆర్కామేదియా వర్క్స్ బ్యానర్లపై నీలిమ తిరుమల శెట్టి, శోబు యార్లగడ్డ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











