పవన్ ‘పంజా’ స్టోరీ ఇదేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'పంజా". ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారం బయటకు లీకైంది. ఇందులో పవన్ డబల్ రోల్ చేస్తున్నాడని, ఒకటే మో డాన్ పాత్ర, మరొకటేమో విలేజ్ కుర్రాడి పాత్ర అని చర్చించుకుంటున్నారు. పంజా చిత్రంలో దెబ్బ తిన్న పులి లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనని దర్శకుడు విష్ణు వర్ధన్ ఇటీవల వెల్లడించారు. దీన్ని బట్టి ఓ సమాన్య విలేజ్ యువకుడు కొందరి వల్ల జీవితంలో దెబ్బతిని తన వాళ్లని పోగొట్టుకుని వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలో పవన్ కనిపించనున్నారని చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో పవన్ పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది.
పవన్ సరసన సారాజేన్ డియాస్, అంజలీ లవానియా హీరోయిన్స్ గా చేస్తున్నారు. క్రిష్, త్రీ ఇడియట్స్, లాంటి భారీ చిత్రాలకు స్టంట్స్ సమకూర్చిన శ్యామ్ కౌశల్ స్టంట్ మాస్టర్ కావడంతో భారీ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉంటాయంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, నిర్మాతలు : నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.


Click it and Unblock the Notifications











