Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ ఈ ఒక్క సెంటిమెంట్ వర్కౌటైతే... బాక్సులు బద్దలే!
బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్ కే కాదు.. సినిమా లవర్స్ కు కూడా పండగే. ఆయన సినిమా థియేటర్లలో రిలీజ్ అంటే పండగ వాతావరణం ఉంటుంది. ఇక ఆయన ఈసారి దసరా జోర్దార్ ఉంటుంది అంటూ భగవంత్ కేసరి సినిమాతో రాబోతున్నారు. ఇక ఆ సినిమాలో బాలయ్య సెంటిమెంట్ ఉందట. ఇక ఈ సారి కూడా హిట్ ఖాయం అంటున్నారు. మరి ఆ సెంటిమెంట్ ఏంటి.. అసలు ఆ సినిమా కథేంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన కరోనా టైంలో అఖండ సినిమాతో ప్రేక్షకల ముందుకు వచ్చి... సూపర్ హిట్టును అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అన్ స్టాపబుల్ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక సీజన్ వన్ సక్సెస్ కావడంతో.. సీజన్ 2 తో అలరించాడు బాలయ్య. ఇక సీజన్ 3 కూాడా స్టార్ అవుతున్నట్లు ప్రస్తుతం నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఆ విషయం పక్కన బెడితే.. అన్ స్టాపబుల్ సినిమా తర్వాత బాలయ్య వీరసింహరెడ్డి చేశాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే బాలయ్య గత సినిమాల్లో వాడిన సెంటిమెంట్ ను ఈ భగవంత్ కేసరి సినిమాలోనూ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ సినిమా కూడా సూపర్ హిట్టు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే... ఈ సినిమాలో పాప సెంటిమెంట్ ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ గమనిస్తే.. ఆ పోస్టర్ లో బాలయ్య ఓ పాపతో కూర్చొని ఉంటాడు. ఇందులో పాప సెంటిమెంటు ఉంటుందని అర్ధం అవుతుంది. ఇక భగవంత్ కేసరి సినిమా తండ్రి కూతుళ్ల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇక గత అఖండ సినిమాలోనూ పాప సెంటిమెంట్ ఉంది. ఆ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలుస్తుందని అంటున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుందని తెలుస్తోంది. ఇక కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మునుపెన్నడు చూడని లుక్ లో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక పాప సెంటిమెంట్ వర్కౌట్ అయితే.. బాక్సులు బద్దాలు అవ్వాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











