సర్కార్ వారి పాట అంటోన్న మహేష్.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో పరుశురామ్ రెడీ
మహేష్ బాబు 27వ ప్రాజెక్ట్‌లో ఎన్నో మలుపులు ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించని పరిణమాలు చోటుచేసుకున్నాయి. అకస్మాత్తుగా వంశీ పైడిపల్లిని పక్కన పెట్టేయడం, తదుపరి డైరెక్టర్, ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్‌ను జల్లెడ పట్టడం. చివరకు మహేష్ బాబు లిస్ట్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా వచ్చేశాడని టాక్ వినిపించింది.
అంతకుముందు మహేష్ బాబుతో సినిమా చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేసి వేరే హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు పరుశురామ్. ఆ ప్రాజెక్ట్ కాస్త పక్కకి పోయి.. మహేష్ బాబు సినిమా లైన్‌లోకి వచ్చింది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్‌డేట్ వచ్చింది.

గీతగోవిందం తరువాత..
గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పరుశురామ్ మరో చిత్రాన్ని తెరకెక్కించలేదు. దాదాపు రెండేళ్ల తరువాత ఓ ప్రాజెక్ట్‌ను సెట్ చేయించుకున్నాడు. మొదటగా మహేష్ బాబుకు కథ వినిపించినా అంతా ఓకే అయినా ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టేయడంతో నాగచైతన్యతో నాగేశ్వరరావు అనే సినిమాను లైన్‌లో పెట్టేశాడు పరుశురామ్.

అదృష్టం తలుపుతట్టింది..
అయితే పరుశురామ్ టైమ్ బాగున్నట్టుంది. అందుకే మహేష్ బాబు వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ సైడ్ అయిపోయింది. పరుశురామ్ సినిమా లైన్‌లోకి వచ్చింది. దీంతో పరుశురామ్ నాగచైతన్య ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసి.. మహేష్ బాబు కథలో లీనమయ్యాడు. ఈ మూవీ గురించి చెబుతూ అనేక విషయాలను వెల్లడించారు.

అన్ని అంశాలుండే చిత్రమిది..
ఆ మధ్య ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ మహేష్ బాబు ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు తాను రాసిన కథలకు, తీసిన సినిమాలకు మాస్ సీన్స్, ఫార్మూలా అవసరం రాలేదని, అందుకే రాయలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ చిత్రంలో మాత్రం అవన్నీ ఉంటాయని, ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకునేలా ఉంటుందని తెలిపాడు.
Recommended Video

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా..
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే (మే 31) సందర్భంగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్‌ను పరుశురామ్ ఫిక్స్ చేశాడట. మహేష్ బాబు కూడా ఓకే అంటే.. ఇదే టైటిల్‌ను పూజా కార్యక్రమంలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











