ఆ రోజుపై మహేష్ బాబు మోజు.. కారణమదేనా? వెరీ వెరీ క్రేజీ..
ప్రస్తుతం వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ మంచి జోష్‌లో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు రూపంలో భారీ బ్లాక్ బస్టర్స్ సాధించిన ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు.
'సరిలేరు నీకెవ్వరు' అంటూ 2020 సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చిన మహేష్ బాబు.. ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేయబోతున్నారని టాక్. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా వీరిద్దరి కాంబోలో కొత్త సినిమా రూపొందనుంది. నిజానికి మహేష్ బాబు తన 27వ సినిమాను వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల అది క్యాన్సిల్ కావడంతో.. డైరెక్టర్ పరశురామ్ లైన్ లోకి వచ్చేశారు.

మే 31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే మహేష్ కోరిక మేరకు ఈ సినిమాను 2021 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీ నిర్మించబోతున్నాయి.
2021 ఏప్రిల్ 28వ తేదీపై మహేష్ మోజు పడుతున్నాడంటే.. దానికి ఓ కారణం కూడా ఉంది. ఆయన కెరీర్‌ని టర్న్ చేసిన 'పోకిరి' సినిమా 2006 సంవత్సరం అదే తేదీన విడుదలైంది. అదే సెంటిమెంట్‌తో మహేష్ బాబు, నిర్మాతలు ఇలా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











