150 వ చిత్రం: చిరంజీవి ని రిజెక్టు చేసిన హీరోయిన్

మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఎప్పుడు చేస్తారో అంటూ అభిమానులంతా చాలా కాలం నుంచి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తనకు సినిమా చేసే సమయం లేక పోయినా, వారిని నొప్పించకుండా ఉండటానికి తనకు సూటయ్యే మంచి కథ దొరకితే చూద్దాం, సమయం అనుకూలిస్తే చేద్దాం అని కహానీలు చెబుతూ కొంత కాలం నెట్టుకొచ్చే ప్రయత్నం చేసారు చిరు.
కొన్ని నెలల క్రితం బెంగుళూరులో చిరంజీవి మాట్లాడుతూ...చక్కని సందేశంతో కూడిన సామాజిక విలువలున్న కథ దొరికితే నటించడానికి నేను సిద్దమే అని, సోనియా గాంధీ అనుమతితో 150వ సినిమా చేస్తానని తెలిపారు.
ప్రస్తుతం చిరంజీవి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికల వరకు ఆయన ఫుల్ బిజీ. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేసే వీలు ఆయనకు దొరకడం అసంభవం. 2014 ఎన్నికల తర్వాత అయినా చిరంజీవికి సినిమాలపై దృష్టి సారించే అవకాశం ఉందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి. చేస్తే మాత్రం ఆ సినిమాను తానే నిర్మిస్తానని చిరు తనయుడు రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











