'రక్త చరిత్ర' ఫొటోలలో...పవన్, పరిటాల రవి ఎపిసోడ్?

By Srikanya

పవన్ కళ్యాణ్, పరిటాల రవి మధ్య జరిగిన ఇష్యూ 'రక్త చరిత్ర' చిత్రంలో చోటు చేసుకోనుందా అనే సందేహం సినిమా ప్రారంభమైనప్పటి నుంచీ అందరికీ కలుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రక్త చరిత్రకి సంభందించి రిలీజ్ చేసిన ఫొటోల్లో ఓ వ్యక్తికి గుండు గీయించటం ఉంది. అదీ పరిటాల రవి పాత్ర ధారి వివేక్ ఒబరాయ్ సమక్షంలో. దాంతో ఈ సీన్ కీ, పవన్ కథనానికి ముడి పెడుతూ అన్ని చోట్లా మళ్ళీ సందేహాలు, చర్చలు మొదలయ్యాయి. అయితే అంత సాహసానికి వర్మ ఒడి కట్టడని, కేవలం ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య జరిగిన తీరుపైనే కేంద్రీకరిస్తారని ఓ వర్గం అంటోంది. అయితే వర్మ సెన్సేషన్ కోసం ఏదైనా చేస్తాడని ఈ సంఘటన గ్యారెంటీగా స్క్రిప్టులో ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఏది నిజమో తెలియాలంటే రక్త చరిత్ర బయిటపడేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక ఆగస్టు 12న రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ చిత్రంలో మద్దెల చెరువు సూరి గా తమిళ హీరో సూర్య కనిపించనున్నాడు. అతని భార్యగా ప్రియమణి చేస్తోంది. పరిటాల రవి, మద్దెల చెరువు సూరి పాత్రల్లో దేన్ని నెగిటివ్ చూపెట్టనున్నాడనే మరో సందేహం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X