పవన్ ఫ్యాన్స్‌కు పండగే: ‘వకీల్ సాబ్’లో హైలైట్ సీన్ అదే.. ఆ 10 నిమిషాలు పూనకాలు ఖాయం.!

By Manoj Kumar P

టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ తమ్ముడిగా పరిచయమైనప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే చాలా కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన.. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో కొద్ది రోజులుగా పవన్ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు నటిస్తున్న సినిమా గురించి ఓ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

లాయర్ సాబ్.. వకీల్ సాబ్‌గా మారాడు

లాయర్ సాబ్.. వకీల్ సాబ్‌గా మారాడు

బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘పింక్' సినిమా రీమేక్ ద్వారానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. మొదట అనుకున్న ‘లాయర్ సాబ్' బదులు ఈ మూవీకి ‘వకీల్ సాబ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో నివేదా థామస్, అంజలి కీలక పాత్రలు చేస్తున్నారు.

పవన్ కోసం కథలో చాలా మార్పులు

పవన్ కోసం కథలో చాలా మార్పులు

వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్ కథతో ‘పింక్' సినిమా తెరకెక్కింది. ఆ తర్వాత దీన్ని తమిళంలో అజిత్ హీరోగా ‘నెర్కొండ పార్వాయి'గా తీశారు. ఈ రెండు మూవీల్లో హీరోకు ఎలివేషన్ కనిపించలేదు. అయితే, పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ కావడంతో ‘వకీల్ సాబ్'లో ఆయన పాత్ర కోసం చాలా మార్పులు చేశారని ప్రచారం జరుగుతోంది.

హాట్ బ్యూటీని కూడా తీసుకొస్తున్నారు

హాట్ బ్యూటీని కూడా తీసుకొస్తున్నారు

ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇలియానా, అనుష్క సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజాగా దీని కోసం హాట్ బ్యూటీ శ్రుతీహాసన్‌ను తీసుకుంటున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి ‘గబ్బర్ సింగ్' మూవీలో నటించిన విషయం తెలిసిందే.

ఏమాత్రం తగ్గని క్రేజ్.. రికార్డులు బద్దలు

ఏమాత్రం తగ్గని క్రేజ్.. రికార్డులు బద్దలు

పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న ప్రభావమో ఏమో గానీ ‘వకీల్ సాబ్' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకేనేమో ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు మొదటి పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అందుకే కొన్ని గంటల్లోనే ఈ రెండింటికీ కోట్లలో వ్యూస్ వచ్చాయి. ఇక, అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోయాయి.

‘వకీల్ సాబ్' మూవీలో హైలైట్ సీన్ అదే

‘వకీల్ సాబ్' మూవీలో హైలైట్ సీన్ అదే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ‘వకీల్ సాబ్' హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో రెండు ఫైట్స్ ఉంటాయట. అందులో పార్క్‌లో జరిగే పవన్ ఎంట్రన్స్ ఫైట్ సీన్ హైలైట్‌గా ఉంటుందని తెలిసింది. ఇందులో ఆయన స్టైల్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుందని సమాచారం.

Recommended Video

Vakeel Saab : Shruti Haasan To Pair Up With Pawan Kalyan In Vakeel Saab?
ఆ 10 నిమిషాలు పూనకాలు ఖాయం.!

ఆ 10 నిమిషాలు పూనకాలు ఖాయం.!

హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే ఈ ఫైట్ దాదాపు పది నిమిషాల పాటు ఉంటుందట. ఇది వస్తున్నంత సేపు ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోతారనే టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం లీకైన వీడియో కూడా ఈ ఫైట్‌కు సంబంధించినదే అని అంటున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి పవన్ కల్యాణ్ అభిమానులు సంబర పడిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X