బాలయ్యతో 'చిరు'కి బుద్ది చెప్పిస్తాం అంటున్నారు...!?
చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన 150వ సినిమా కోసం కథ రెడీ చేసారు పరుచూరి బ్రదర్స్. కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే రాజకీయాల్లోకి అడుగుపెట్టి 150వ ప్రాజెక్ట్ కి బ్రేకులు వేసాడు చిరు..తాజాగా సినిమాల్లోనే నటించనని ప్రకటించాడు. మళ్ళీ రెండు రోజులకే అమితాబ్ కోరిక మేరకు సినిమాల్లో నటిస్తానని, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తానని చెప్పాడు చిరు.
కానీ తన కోసం ఎంతో కష్టపడి కథ రెడీ చేసిన పరుచూరి బ్రదర్స్ ని మాత్రం చిరు పట్టించుకోవడంలేదట. వేరే కథతో సినిమా చేయడానికి చిరు సన్నాహాలు చేస్తున్నాడట. దాంతో పరుచూరి బ్రదర్స్ కోపంతో రగిలిపోతున్నారని సమాచారం. చిరు కోసం రెడీ చేసిన కథను బాలయ్యకు చెప్పాలనుకుంటున్నారట బ్రదర్స్. ఒక వేళ బాలయ్య అంగీకరిస్తే చిరంజీవి 150వ సినిమా కాస్తా బాలయ్య 100వ చిత్రానికి ఇచ్చి చిరుకి షాక్ ఇవ్వాలని పరుచూరి బ్రదర్స్ అనుకుంటున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











