ఎన్టీఆర్ బృందావనంలో పరుచూరి బ్రదర్స్ ట్విస్ట్?
జూ ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న బృందావనం చిత్రం మరీ లైటర్ వీన్ కామిడిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఎన్టీఆర్ భావించి కొన్ని మార్పులు చేయబోతున్నారని వినపడుతోంది. అందులో భాగంగా పరుచూరి బ్రదర్స్ ని రప్పించి కొన్ని సన్నివేశాలకు పవర్ ఫుల్ డైలాగులు రాయించాలని ఆలోచిస్తున్నారుట. ఈ మేరకు పరుచూరి వారిని ఒప్పించారని తెలుస్తోంది. బాబాయ్ బాలయ్య సింహా హిట్ కావటంతో తన చిత్రంలోనూ ఆ రేంజి పవర్ ఫుల్ డైలాగులు ఉండటం మేలని నిర్ణయానికి వచ్చాడంటున్నారు. ఇక బృందావనంలో ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిపోయే పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. కాజల్, సమంత పోటీపడి నటించే కొన్ని సన్నివేశాలు ధియోటర్ ని నవ్వుల్లో ముంచెత్తనున్నాయని అంటున్నారు. ఇక మధ్యలో పరుచూరి వారి పవర్ ఫుల్ డైలాగ్స్ ఏ మేరకు కలుస్తాయో..వర్కవుట్ అవుతాయో చూడాలి.
జూ ఎన్టీఆర్ బృందావనం బాలకృష్ణ సింహా బోయపాటి శ్రీను jr ntr brindavanam balakrishna boyapati srinu simha


Click it and Unblock the Notifications