'ఆంజనేయులు' దర్శకుడు పరుశరామ్ నెక్ట్స్ ఆ హీరోతో
రవితేజ, నయనతార కాంబినేషన్లో ఆంజనేయులు చిత్రాన్ని రూపొందించిన పరుశరామ్ తాజాగా మరో స్క్రిప్టు ఓకే చేయించుకున్నారు. వైజాగ్ కి చెందిన వంశీ కృష్ణ శ్రీనివాస్ అనే బిజినెస్ మెన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారనున్నారు. పరుశరామ్ కథ నచ్చి సినిమా చేయటానికి ముందుకువచ్చారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి హీరోగా నారా రోహిత్ ని తీసుకున్నారు. ఇత ఆంజనేయులు ఘోరంగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటంతో దర్శకుడుగా పరుశరామ్ కి గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ ని సద్వినియోగం చేసుకుని మంచి స్క్రిప్టు రూపొందించాడని తెలుస్తోంది. ఇక పరుశరామ్ కిది మూడో చిత్రం. మొదటి చిత్రం నిఖిల్ హీరోగా రూపొందిన యువత. అలాగే పరుశరామ్..ప్రముఖ దర్శకుడు పూరీ దగ్గర పనిచేసారు. ఇక ఈ కొత్త చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. జనవరి నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఓ క్రేజీ హీరోయిన్ ని డేట్స్ కోసం అడుగుతున్నారు. అలాగే 'బాణం"తో హీరోగా పరిచయమైన నారా రోహిత్ మరో చిత్రం కూడా చేస్తున్నారు. సుకుమార్ వద్ద అసోసియేట్ డైరక్టర్‌గా పనిచేసిన ప్రకాష్ దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రం రూపొందిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











