రైట్స్ కోసం ట్రై చేస్తున్న రాజమౌళి
హైదరాబాద్ : రాజమౌళి ప్రస్తుతం భారీగా 'బాహుబలి' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తదనంతరం ఆయన ఏం చిత్రం చేస్తారు...ఎలాంటి సినిమా అదీ అన్న దానికి ఓ క్లారిటీ వచ్చినట్లే. తాజాగా ఆయన మహాభారతం నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచన ఎప్పటి నుంచో రాజమౌళికి ఉన్నదే. అయితే ఇప్పుడు అందుకు సంపూర్తిగా తగిన ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది.
కన్నడలో పాఠకాదరణ పొందిన 'పర్వ' అనే నవల ఆధారరగా రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నవలను ఎస్.ఎల్.భైరప్ప రచించారు. మహాభారత యుద్ధాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన రచన ఇది. ప్రస్తుతం 'పర్వ' నవల హక్కుల కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

కథ ఏదైనా సరే, దానికి భారీతనం, సాంకేతిక హంగులు జోడించడం ఎస్.ఎస్.రాజమౌళికి అలవాటైన విద్యే కాబట్టి ఈ చిత్రాన్ని భారీగా...అపరిమితమైన బడ్జెట్ తో అద్బుతంగా తీర్చిదిద్దాలని రాజమౌళి కల అన్నట్లు చెప్తున్నారు. సురేష్ బాబు ఈ ప్రాజెక్టుకు పూర్తి స్ధాయిలో సహాయసహకారాలు అందిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రం మొదలైతే తెలుగులో స్టార్ హీరోలను చాలా మందిని ఒకే సినిమాలో చూసే అవకాసముందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











