బాలకృష్ణ సరసన పవన్ హీరోయిన్ ఖరారు
ఎల్లో ప్లవర్స్ బ్యానర్ పై రవి చావలి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇంకా పేరు పెట్టని చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ కొత్త చిత్రం పిబ్రవరి 6న ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జల్సా చిత్రంలో నటించిన పార్వతి మిల్టన్ హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. ఈమె రీసెంట్ గా మహేష్ బాబు దూకుడు చిత్రంలో ఐటం సాంగ్ చేసి మళ్లీ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా చేస్తున్న యమాయనమహ చిత్రంలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. మహేష్ సరసన త్రివిక్రమ్ ఆఫర్ ఇస్తాడని ఎదురుచూసి ఖలేజాలో దొరకకపోయేసరికి నిరాశపడ్డ ఆమె చాలా కాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.
మళ్లీ గ్యాప్ తర్వాత ఆమె మహేష్ రికమండేషన్ దూకుడు ద్వారానే మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక బాలకృష్ణ తాజా చిత్రంలో ఆమె పాత్ర గ్లామరస్ గా సాగుతుందని చెప్తున్నారు. ఈ చిత్రంతో ఆమె మళ్లీ స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తుందని భావిస్తోంది. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ రోల్ ని పోషించనున్నారని అంటున్నారు. రవిచావలి గతంలో జగపతిబాబుతో సామాన్యుడు వంటి హిట్ చిత్రం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏమీ ఆడలేదు. రీసెంట్ గా సుమంత్ తో దగ్గరగా దూరంగా చిత్రం రూపొందించారు. అదీ భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.


Click it and Unblock the Notifications