పవన్ ‘మున్నీ’గా ఆ సెక్సీ లేడీ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్ సింగ్". సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రూపొందిన సూపర్ హిట్ మూవీ 'దబాంగ్" రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అక్టబర్ 29 నుంచి ఈ సినిమా షూటింగ్ కేరళలోని పొల్లాచ్చిలో జరుగనుంది. హిందీ దబాంగ్‌లో మలైక అరోరా 'మున్నీ బదనాం హుయే" పాట ఐటం భారీ హిట్టయిన నేపథ్యంలో...తెలుగులో ఆ పాటలో ఎవరు కనిపించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
గబ్బర్ సింగ్ సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ఈ సినిమాలో ఐటం గర్ల్ గా....ఫార్వతి మెల్టన్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇటీవల వచ్చిన దూకుడు సినిమాలో పువాయ్ పువాయ్ పాటతో పార్వతి తన అందచందాలు, ఒంపుసొంపులతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ లోనూ ఆమెనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారట దర్శక నిర్మాతలు. కాగా...దబాంగ్ తమిళ రిమేక్ ఓస్తిలో మున్ని ఐటం సాంగులో మల్లికా శెరావత్ నటిస్తోంది. పవర్ స్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ జల్సా తర్వాత ఓ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజికల్ హిట్స్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











