»   » పార్వతి మిల్టన్ కావాలా? రోజు రేటు ఎంతంటే...

పార్వతి మిల్టన్ కావాలా? రోజు రేటు ఎంతంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెడ్ వైన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పార్వతి మిల్టన్ తన రేటుని రోజుకి లక్షన్నర గా ఫిక్స్ చేసి రాయబారాలు పంపుతోంది. దర్శక, నిర్మాతలు కొందరు ఆమెతో తీయాల్సిన సీన్స్ కొద్ది రోజుల్లో ఫినిష్ చేసి పంపిచేసి తక్కువ రేటుకే ఆమెను తమ సినిమాల్లో చేయించుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇక అనుష్క రోజుకి రెండు లక్షల రేటు చెప్పి వేదం చిత్రంలో చేయటం ఆమెను ఈ నిర్ణయం తీసుకునేటట్లు చేసిందంటున్నారు. త్రివిక్రమ్, మహేష్ సినిమాలో చేస్తున్నానని భావించి అప్పట్లో డేట్స్ ఇవ్వకుండా చాలా నిర్మాతలకు హ్యాండ్ ఇవ్వటంతో ఆమె ఖాళీ పడిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా రాలేదని డిప్రెషన్ లో పడి అమెరికా వెళ్లి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మిగతా చోట్ల ఆఫర్స్ కోసం ట్రై చేస్తూ ఈ రేట్ ఫిక్స్ చేసింది. ఈ స్కీమ్ వర్కవుట్ అయ్యి ఆమె మళ్ళీ బిజీ అవుతుందని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu