ఆ అగ్ర హీరోతో ప్రభాస్ మల్టీస్టారర్ లైన్ క్లియర్ అయినట్లే.. పఠాన్ డైరెక్టర్ బిగ్గెస్ట్ ప్లాన్!
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఊహించని స్థాయిలో మల్టీ స్టారర్ సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే ఇతర ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో అయితే పఠాన్ దర్శకుడు ప్రభాస్ తో ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అది కూడా ఒక తెలుగు బడా ప్రొడక్షన్ హౌస్ ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

మారుతున్న అగ్ర హీరోలు
ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు అంటే చాలా అరుదుగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు దర్శకులు కూడా అలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం చేస్తూ ఉండడంతో నిర్మాణ సంస్థలు కూడా భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇక హీరోలు అయితే చాలా వరకు విషయంలో వారి ఆలోచన విధానాన్ని చాలా మార్చుకున్నారు అనే చెప్పాలి. మంచి కంటెంట్ ఉంటే ఏ హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ప్రభాస్ మల్టీస్టారర్
రాబోయే రోజుల్లో బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు కలిసి సినిమాలు చేయబోతున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కొన్ని బడా ప్రొడక్షన్ హౌస్ లు విషయాలలో దర్శకులతో హీరోలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతోంది. ఇక ప్రభాస్ ఫ్యూచర్ లో కూడా బాలీవుడ్ హీరోలతో కలిసి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ పెద్దగానే ఉంది. అయినప్పటికీ కూడా అతను కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలి అని గత ఏడాది నుంచి చర్చిలు అయితే జరుగుతున్నాడు. ఇక వీరి కలయికలో రాబోయే ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ ఒక బడా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి నిర్మించడానికి రెడీ అవుతోంది.

హిట్ అందుకోవడంతో..
సిద్ధార్థ ఆనంద్ ఇటీవల పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ బిగ్ యాక్షన్ మూవీ ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇక పఠాన్ దర్శకుడు భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు అతని తో సినిమా చేయడానికి ప్రభాస్ తో పాటు మరొక బాలీవుడ్ హీరో కూడా రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ బాలీవుడ్ స్టార్ తో చర్చలు
అయితే పటాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్ తో చేయబోయే సినిమాలో మరో బాలీవుడ్ యాక్షన్ హీరోయిన్ కూడా సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు హృతిక్ రోషన్ అని తెలుస్తోంది. ఇదివరకే ఈ విషయంలో కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ హృతిక్ రోషన్ తో చర్చలు జరిపి రెమ్యునరేషన్ గురించి కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











