Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి డైరెక్షన్ లో పాతాళభైరవి రీమేక్ లో జూ ఎన్టీఆర్..
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎనిమిది చిత్రాలతో.. అవి కూడా వరుసగా విజయాలు సాదించడమంటే మాటలా? అంతకు ముందెప్పుడో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు వరుసగా 12 విజయాలందుకున్నారని చెబుతారు. కానీ ఇటీవల కాలంలో ఈ ఫీట్‌ను సాధించిన దర్శకులెవరూ మనకు కనిపించరు.
జూ ఎన్టీఆర్ 'స్టూడెంట్ నెం.1'తో మొదలైన రాజమౌళి దర్శకయాత్ర 'సింహాద్రి' చిత్రంతో జైత్రయాత్రగా మారి.. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే వుంది. సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాదరామన్న ఒక సినిమాతో ఒక సినిమాకు పోలిక లేకుండా, రూపొందించిన ప్రతి సినిమాతో సంచలన విజయంసాధించడం ఒక ఎత్తయితే, 'ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలన్న' ఆర్యోక్తిని నరనరాన అణువణువునా జీర్ణింపజేసుకుని ఎంతో అణకువగా ఉండడం మరొక ఎత్తు. అటువంటి స్టార్ దర్శకుడు రాజమౌళితో జూ ఎన్టీఆర్ సినమా చేయబోతున్నాడు అంటే సంచలనమే.
తెలుగు చలన చిత్ర చరిత్రలో 'పాతాళ బైరవి"కి మంచి స్థానం ఉంది. ఇప్పుడా చిత్రాన్ని రీమేక్ చేయడానికి దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది 3డి ఫిలిం అని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన గ్రౌండ్ వర్క్ చేసే పనిలో రాజమౌళి నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.