వర్మ దగ్గరకు చేరిన మరో ఫ్లాఫ్ హీరో

By Srikanya

హైదరాబాద్ : తెలుగులో పెద్దగా క్రేజ్ లేని హీరోలంతా వర్మ దగ్గరకు చేరుతున్నారు. వర్మే వారిని ఎప్రోచ్ అవుతున్నారో లేక వారే ..వర్మని కలిస్తున్నారో కానీ ఆయన ఫ్లాఫు హీరోలకు చిరునామాలా మారుతున్నారు. తాజాగా ఆయన వద్దకు వరస ఫ్లాపులతో సతమతమవుతున్న నవదీప్ చేరాడని ఫిల్మ్ నగర్ సమాచారం. మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ వరస ఫ్లాపుల హీరో రాజశేఖర్ తో పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే.

పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ఇప్పుడు నవదీప్ వచ్చి చేరాడని తెలుస్తోంది. నవదీప్ స్పెషల్ అప్పీరియన్స్ తో ఈ ప్రాజెక్టుకు క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు. అయితే నవదీప్ కు ప్రస్తుతం వరస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. భాక్సాఫీస్ వద్ద ఓపినింగ్స్ సైతం తెచ్చుకోలేని పరిస్దితి అతనిది. అయితే ఆ పాత్రకు నవదీప్ అయితే సరిపోతాడని భావించి తీసుకున్నాడంటున్నారు.

Patta Pagalu has Navadeep's special

ఇక రామ్ గోపాల్ వర్మ అత్యంత ఇష్టమైన జెనర్ ఏదీ అంటే హర్రర్ అన్నట్లుగా ఆయన వరసగా ఆ సినిమాలు దింపుతూండటం జరుగుతున్నదే. అయితే అవి భాక్సాఫీస్ వద్ద అలరించకపోయినా వాటి బడ్జెట్ తక్కువ కావటంతో పెద్దగా నష్టం కూడా జరిగిన ధాకలాలు ఉండవు. అయితే ఎప్పటికైనా జనాలను భయపెడతానని, అదే తన లక్ష్యం అన్నట్లు చెప్పే వర్మ ఈ సారి పట్టపగలు అనే చిత్రంతో వస్తున్నారు.

హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురున్న తండ్రిగా రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లోనే ఆయన నటిస్తున్నారు. 'బ్రేకప్'లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తోంది.

దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ సైతం పూర్తైందని అంటున్నారు. రాజ శేఖర్ సినిమాలు ఈ మధ్యన రావటం లేదు. వచ్చినా ఆడటం లేదు. చాలా స్లంప్ లో ఉన్న రాజశేఖర్ చేస్తున్న చిత్రం కావటంతో దీనిపై క్రేజ్ వచ్చే అవకాసం ఉందంటున్నారు. ఈ చిత్రానికి రాజశేఖరే నిర్మాత కావటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X