twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ 200 కోట్లు వద్దన్నాడా..?? నిజమా గాసిప్పా?? ఇస్తానన్నది ఎవరో తెలుసా..??

    |

    దాదాపుగా జనసేన పార్టీ ని పూర్థిస్థాయి లో నడపటానికి సిద్దమైన పవన్ కళ్యాన్ తరవాతి కార్యాచరణ ఏమితీ..? అన్ని పార్టీలలోనూ, అందరు నాయకుల్లోనే కాదు సామాన్య జనం లోకూడా ఇదే క్యూరియాసిటీ. అయితే పవన్ మాత్రం తన అభిమానుల్లోనూ, జనసేన పార్టీ కార్య కర్థలలోనూ ఇంకా ఉత్సాహం నింపుతూ తన లక్ష్యం అవినీతి లేని రాజకీయాలే అన్న సంకేతాలివ్వటం తప్ప తన స్టాంద్ ఏమిటో ఇప్పటికీ ఒక ఖచ్చితమైన క్లారిటీ మాత్రం ఇవ్వటం లేదు. ఇక ఇప్పుడు తాను వేస్కున్న ప్రణాలిక ప్రకారం ముదుకువెళ్ళటానికి వేసుకున్న అన్ని జిల్లాలోనూ బహిరంగ సభలు కాన్సెప్ట్ కూడా పక్కకు పెట్టేయటం తో అందరిలోనూ మరింత అయోమయం చోటు చేసుకుంది.

    ఇటు 2019 లోపు పూర్తి చేయాల్సిన సినిమాలు ఒక పక్కా, అటు ఎన్నికలకు సిద్దాం చేయాల్సిన పార్టీ పనులూ ఒకపక్కా ఉండటం తో అసలు ఈ రెండిటినీ పవన్ ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయగక్లడన్న విశయం లో మాత్రం పవన్ గురయ్యే ఒత్తిడిని9 ఆయన కన్నా కయకర్తలూ, అభిమానులే ఎక్కువ ఆందోళనలో ఉన్నారు.

    షాకింగ్ న్యూస్

    షాకింగ్ న్యూస్

    ఇప్పటికే కొన్ని నెలల క్రితమే ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్ కాటమ రాయుడు విషయం ఎక్కడున్నది అక్కడ ఉన్నట్టే కనబడుతోంది. అసలే సర్దార్ భారీ ఫ్లాప్ తో ఆర్థిక చిక్కుల్లో పడ్దపవన్ కి ఇప్పుడొక హిట్ సినిమా అత్యంత అవసరం కూడా... ఈ నేపథ్యం లో వినిపిస్తున్న ఒక షాకింగ్ న్యూస్ పవన్ మీద గౌరవాన్ని పెంచుతూనే పవన్ నిర్ణయం కరెక్టేనా అనిపించేలా ఉంది ఇంతకీ పవన్ ఏం చేసాడంటే....

    200 కోట్ల పార్టీ ఫండ్

    200 కోట్ల పార్టీ ఫండ్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక పారిశ్రామిక వేత్త పవన్ కు తన ‘జనసేన' కార్యక్రమాలు మరింత విస్తృతంగా జనం మధ్యకు తీసుకు వెళ్లడానికి 200 కోట్ల పార్టీ ఫండ్ ను ఆఫర్ చేసినట్లు గాసిప్పులు మొదలు అయ్యాయి. అయితే ఈ ఆఫర్ ను పవన్ చాలా సున్నితంగా తిస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.

    సరి కాదని భావించాడట

    సరి కాదని భావించాడట

    తనదగ్గర డబ్బు లేదంటూనే ఇప్పుడు స్వయంగా తానే వచ్చి ఇచ్చిన పార్టీ ఫండ్ ని ఎందుకు వద్దన్నట్టు అనికొందరికి అనిపించినా. పవన్ మాత్రం డబ్బున్న వళ్ళకంటే పార్టీలో నిజాయితీ గా ఉండటం, ట్రాన్స్పరెంట్ గా అన్నీ బయటికి తెలిసేలా ఉండటం ముఖ్యం అనుకుంటున్నప్పూడు.. ఆ డబ్బు తీసుకోవటం సరి కాదని భావించాడట. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి అడుగులు వేయడానికి ఒక ప్రాధమీక నిర్ణయం తీసుకున్న పవన్ మరో ప్రముఖ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి.

    లోక్సత్తా తో జనసేన

    లోక్సత్తా తో జనసేన

    కాకినాడ బాహిరంగ సమావేశం నుండి తిరిగి హైదరాబాద్ చేరుకున్న పవన్ ‘లోక్ సత్తా' పార్టీని అధికారికంగా మూసివేసిన జయప్రకాష్ నారాయణ్ ను కూడా ‘జనసేన'కు అండగానిలుపుకునెందుకు తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నీతీ, నిజాయితీలతో కూడిన సమాజాన్నీ, అవినీతి రాజకీయాలనీ పారదోలటానికే వచ్చిన పర్టీ "లోక్ సత్తా" అన్న అభిప్రాయం చాలామందిలోనే ఉంది.

    పవన్ ఆయుధం అభిమానులే

    పవన్ ఆయుధం అభిమానులే

    పవన్ సిద్ధాంతాల మాదిగా ‘డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయండి' అంటూ ప్రజలలో చైతన్యం కలిగించడానికి జయప్రకాష్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయనకు జనాకర్షణ లేకపోవడంతో జయప్రకాష్ ఆలోచనలు జనంలోకి చొచ్చుకుని వెళ్ళలేకపోయాయి. కానీ జయ ప్రకాశ్ కన్న ఇప్పుడు పవన్ దగ్గర ఉన్న ఒకే ఒక ఒక అదనపు ఆయుదం. తిరుగులేని చరిష్మా.

    వర్క్ ఔట్ అవుతుందా..??

    వర్క్ ఔట్ అవుతుందా..??

    పవన్ ఇప్పటికిప్పుడు సినిమాలను వదిలి పూర్తి రాజకీయ వేత్తగా మారాలి అనే ఆలోచనలు లేకపోవడంతో పవన్ ఆలోచిస్తున్న దీర్ఘకాలిక ఎత్తుగడలకు జయప్రకాష్ తోడు అయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి అని కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. అయితే జయప్రకాష్ లాంటి సున్నిత వ్యక్తిత్వం గల వ్యక్తి పవన్ తో చేతులు కలిపి తర్వాత ఈ అత్యంత ఆవేశాన్ని భరించి దీర్ఘకాలం ఉండగలడా అన్నదే ఇక్కడ ప్రశ్న.

    నాయకుడయ్యేంతగా ఎదగలేదు

    నాయకుడయ్యేంతగా ఎదగలేదు

    వ్యక్తిగతంగా పవన్‌ కళ్యాణ్‌ మంచివాడు కానీ రాజకీయాల్లో రాణించేంతలా ప్రజలకు నాయకుడయ్యేంతలా ఇంకా తయారు కాలేదనీ, ఆవేశం తో పవన్ తీసుకునే నిర్ణయాలు నాయకత్వానికే పనికి రావనీ ఇప్పటిదాకా పవన్‌ కళ్యాణ్‌తో సావాసం చేసిన టీడీపీ బీజేపీలే చెబుతున్న నేపధ్యంలో పవన్ ప్రతిపాదనకు జయప్రకాష్ ఎంత వరకు సానుకూలం గా స్పందిస్తాడు అన్న గుసగుసలు కూడ వినిపిస్తున్నాయి.

    అభిమాని చనిపోయినందుకు

    అభిమాని చనిపోయినందుకు

    ఇది ఇలా ఉండగా కాకినాడ సభలో ఒక అభిమాని చనిపోయినందుకు చెలించిపోయిన పవన్ ఇక పై బహిరంగ సభలే పెట్టనని కామెంట్ చేసినట్లు వార్తలు రావడంతో చిన్నచిన్న అడ్డంకులకే పవన్ ఇలా చెలించిపోతే రాబోతున్న రోజులలో రాజకీయ పెను సవాళ్ళను ఎలా తట్టుకుంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

    English summary
    Latest buzz about paewarstar pavan kalyan that Pavan Rejected 200 Crores party fund for Janaseana?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X