Pavitra Lokesh: ఎఫైర్ టాక్ తో అమ్మ పాత్రలకు దూరమవుతున్న పవిత్ర.. ఆ హీరోలు రిజెక్ట్?

తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్ గా నటించిన పవిత్ర లోకేష్ ఆ తర్వాత కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారిపోయింది. ఒక విధంగా ఆమె హీరోయిన్ కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువగా పాపులర్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా అమ్మ పాత్రల కోసం ఆమెను నేటితరం యువ హీరోలు ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల నరేష్ వివాదంతో ఆమెకు వచ్చిన పాత్రలు కూడా క్యాన్సిల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కొన్ని ఆ విధంగానే క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

16 ఏళ్ళ వయసులోనే..

16 ఏళ్ళ వయసులోనే..

కర్ణాటకకు చెందిన పవిత్ర లోకేష్ మొదట కన్నడ సినిమాలోని మంచి హీరోయిన్ గా గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. కేవలం 16 వేళ్ళ వయసులోనే ఆమె వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. 20 ఏళ్లు రాకముందుకే దాదాపు కన్నడలో 150 సినిమాలు కూడా చేసింది అప్పట్లో ఆమెకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది.

పవిత్ర వయసు ఎంత?

పవిత్ర వయసు ఎంత?

ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు అని ఇంటర్నెట్లో ఒక నెంబర్ అయితే వైరల్ గా మారుతుంది. కానీ అంతకంటే ఎక్కువ వయసు ఉండవచ్చు అని కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక మొదట పవిత్ర లోకేష్ ఒక సాఫ్ట్ వేర్ ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్నాళ్లకు అతనితో విడిపోయింది. ఆ తర్వాత ఆమె సుచెంద్ర ప్రసాద్ తో కూడా ప్రేమలో ఉన్నట్లుగా కథనాలు వెలుపడ్డాయి. అతని నుంచి కూడా ఆమె 2018లో విడిపోయింది.

నరేష్ తో ఎఫైర్ అంటూ..

నరేష్ తో ఎఫైర్ అంటూ..

ఇక గత ఏడాది నుంచి ఆమె యాక్టర్ నరేష్ తో సాన్నిహితంగా ఉన్నట్లు వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఈ తరుణంలో నరేష్ మూడో భార్య కూడా వారికి ఎఫైర్ ఉందని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా పవిత్ర లోకేష్ పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

హోటల్ లో దొరికిపోవడంతో

హోటల్ లో దొరికిపోవడంతో

మా మధ్య ఏమీ లేదు అని మంచి స్నేహితులమని చెప్పిన తర్వాత ఇటీవల ఒక హోటల్లో నరేష్ పవిత్ర కనిపించడంతో నరేష్ మూడో భార్య వారికి ఎఫైర్ ఉన్నట్లుగా కూడా మీడియా ముందు వివరణ ఇచ్చారు. ఇక ఎప్పటికప్పుడు పవిత్ర లోకేష్ ఆమె చేస్తున్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ వార్తలు ఇండస్ట్రీలో కూడా చర్చన్యూయంశంగా మారిపోయాయి.

ఆ హీరోలకు తల్లిగా..

ఆ హీరోలకు తల్లిగా..

ఈ తరుణంలో పవిత్ర లోకేష్ చేయాల్సిన కొన్ని సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగశౌర్య, శర్వానంద్ ఇలా చాలామంది హీరోలకు తల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపును అందుకుంది. నటన విషయంలో అయితే ఆమె బెస్ట్ అని చెప్పవచ్చు.

పవిత్ర సినిమాలు క్యాన్సిల్?

పవిత్ర సినిమాలు క్యాన్సిల్?

అయితే ఇప్పుడు నరేష్ వివాదంతో పవిత్ర లోకేష్ కు రావలసిన అవకాశాలు కూడా చాలావరకు క్యాన్సిల్ అవుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఆమె మేనేజర్ కు ఫోన్ చేసి మరి సినిమా షూటింగ్ వాయిదా పడింది అని మళ్లీ స్టార్ట్ అయినప్పుడు ఫోన్ చేస్తామని ఏదో కారణం చెప్పి ఆమెను ప్రాజెక్టుల నుంచి తప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వద్దని అంటున్న హీరోలు?

వద్దని అంటున్న హీరోలు?

ఇటీవల ఒక ఇద్దరు ప్రముఖ హీరోలు కూడా ఆమెను తల్లి పాత్రలో తీసుకోవద్దు అని రెండు మూడు రోజుల షూటింగ్ జరిగిన తర్వాత కూడా నిర్మాతలకు చెప్పినట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. చివరగా పవిత్ర లోకేష్ 'అంటే సుందరానికి' సినిమాలో ఒక డాక్టర్ పాత్రలో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు. మరి కొత్త ప్రాజెక్టులపై పవిత్ర లోకేష్ ఏదైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X