పవన్ మూవీకి అప్పుడే రూ. 55 కోట్లు బిజినెస్?

By Bojja Kumar

Pawan Kalyan
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 9 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కనీసం సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు....ఇంత భారీ మొత్తం శాటిలైట్ రైట్స్ రూపంలో రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఇందంతా పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ప్రభావంతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం అని చెప్పక తప్పదు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి మరో ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఈచిత్రానికి థియేట్రికల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో, డిజిటల్ మ్యూజిక్ డీల్స్ కూడా కుదిరాయని తెలుస్తోంది.

వీటి రూపంలో నిర్మాత విడుదలకు ముందే రూ. 55 కోట్ల వరకు వసూలు అవుతున్నాయని టాక్. ఈ సినిమాతో నిర్మాత భారీ లాభాలు ఖాయమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్లాపు సినిమాలు కూడా రూ. 40 కోట్లు వసూలు చేసిన సందర్భాలున్నాయని, 'జల్సా' లాంటి హిట్ కాంబినేషన్ కాబట్టి రూ. 55 కోట్లు విడుదల ముందే రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ యూరఫ్‌లో జరుగుతోంది. అక్కడ పవన్ కల్యాణ్, హీరోయిన్స్ సమంత, ప్రణీతలపై రెండు పాటలను, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X