పవన్ తో మళ్లీ కమిటైన ‘పంజా’నిర్మాతలు

మరో ప్రక్క 'పంజా' నిర్మాతల ఆధ్వర్యంలో మూడు చిత్రాలు మొదలు అయ్యాయి. వాటిలో రామ్ గోపాల్ వర్మకు కౌంటర్ గా తీస్తున్న చిత్రం ఒకటి ఉందని తెలుస్తోంది. ఆ చిత్రం పేరు 'ఏ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిలిం-నా సినిమా నా ఇష్టం'. ఐటీ రంగానికి చెందిన రాకేష్ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ విషయాలను నిర్మాతలు నీలిమా తిరుమలశెట్టి, నగేశ్ ముంతా మంగళవారం ఒక ప్రకటనలో మీడియాకు తెలియచేసారు. వారు తీస్తున్న మూడు చిత్రాలు టైటిల్స్ ..అలియాస్ జానకి, ఏ శ్యామ్ గోపాల్‌వర్మ ఫిలిం - నా సినిమా నా ఇష్టం, అరెరే... అరెరే... ఈ చిత్రాల పేర్లు. త్వరలో ఈ చిత్రాలు ప్రారంభం కానున్నాయని చెప్తున్నారు.
నిర్మాతలు మీడియాతో...''కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా, తెలుగు చిత్రపరిశ్రమలో ఎదగాలనుకొని ఉవ్విళ్లూరుతున్న ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఈ చిత్రాలను నిర్మిస్తున్నాం. ఈ చిత్రాల ద్వారా పలువురు సాంకేతికనిపుణులు, నటీనటులు పరిచయం కానున్నారు. ఓ వైపు కొత్తవారితో సినిమాలు చేస్తూ... మరోవైపు భారీ చిత్రాలను కూడా నిర్మిస్తాం. 'అలియాస్ జానకి' చిత్రానికి 'టెన్త్‌క్లాస్' ఫేం చందు దర్శకత్వం వహిస్తారు.
రెండవ చిత్రమైన 'ఏ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిలిం-నా సినిమా నా ఇష్టం' కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుంది. ఐటీ రంగానికి చెందిన రాకేష్ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మూడో సినిమా 'అరెరే... అరెరే'. శేఖర్‌కమ్ముల శిష్యుడు శశికిరణ్ టిక్కాను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఓ చిత్రాన్ని ప్రారంభిస్తాం'' అని తెలిపారు. ఇక త్రివిక్రమ్ తో చేయనున్న చిత్రం పవన్ ప్రస్తుతం పూరీ తో చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు తర్వాత ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











