'గబ్బర్ సింగ్'విషయమై దర్శకుడుపై మండిపడుతున్న పవన్?
పవన్ కళ్యాణ్, మిరపకాయ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్సకత్వంలో గబ్బర్ సింగ్ అనే చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ కు రీమేక్ కు రూపొందే ఈ చిత్రం లో డైలాగు అంటూ రీసెంట్ గా ట్విట్టర్ లో హరీష్ శంకర్ ఓ డైలాగును రిలీజ్ చేసాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడని అంతటా వినిపిస్తోంది. ఆ డైలాగులు ఎంత బాగున్నా సినిమా పూర్తయ్యి ప్రమోషన్ ప్రారంభించేదాకా వాటిని బయిటపెట్టవద్దని హెచ్చరించాడని చెప్తున్నారు. అందులోనూ లవ్ ఆజ్ కల్ రీమేక్ గా వచ్చిన తీన్ మార్ ఆశించిన రీతిలో విజయం సాధించకపోవటంతో పవన్ మరింత చిరాకుగా ఉన్నాడని చెప్తున్నారు.
మరో ప్రక్క దబాంగ్ చిత్రం తెలుగు లో వచ్చే శ్రీహరి చిత్రాల తరహాలో ఉండే పోలీస్ కథే నని, అందులోనూ తెలుగు, తమిళ బాషలకు ఫైట్స్ అందించే విజయన్ మాస్టర్ ఫైట్స్ అక్కడ కొత్తగా అనపించాయని, పంచ్ డైలాలుగు కొత్తేమీ కాదని, ఇలాంటి సినిమా తెలుగువారికి ఏ మాత్రం రంజింపచేస్తుందని కొందరి వాదన పవన్ ని మరింత విసుగ్గా మార్చేస్తోందని చెప్తున్నారు. అయితే మిరపకాయ్ చిత్రంలో పంచ్ డైలాగులతో కథను నడిపించిన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని సమర్ధవంతంగా డీల్ చేస్తాడనే పవన్ ఈ అవకాశం ఇచ్చారని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. అది హరీష్ నిలబెట్టుకుంటాడనే ఆశిద్దాం.


Click it and Unblock the Notifications