twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాద్ షా' ఆడియోకి మెగా హీరో గెస్ట్?

    By Srikanya
    |

    హైదరాబాద్ : జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' ఆడియో మార్చి 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత బండ్ల గణేష్ కీ, పవన్ కి ఉన్న అనుబంధంతో రావటానికి ఒప్పుకున్నాడని ఫిల్మ్ నగర్ లో ప్రచారంలో ఉంది. అలాగే పవన్, ఎన్టీఆర్ కూడా మంచి మిత్రులే అన్న విషయం తెలిసిందే. అయితే ఇది నిరాధారమైన రూమర్ అని కొద్ది మంది కొట్టిపారేస్తున్నారు. అయితే పవన్ వస్తే మాత్రం ఓ పెద్ద సర్పైజ్ క్రిందే లెక్క. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    'బాద్ షా' చిత్రం ఆడియోను వినూత్న రీతిలో విడుదల చేసేదుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇంటిపై ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక సాదాసీదాగా నిర్వహిస్తే ఆ ఎఫెక్టు వల్లనే ఇలా చేసారనే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో, బాద్ షా ఆడియో వేడుక వినూత్న పద్దతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

    దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    The strong buzz making rounds is that a surprise guest would be gracing the audio launch of Baadshah. However, the makers are making sure that the identity of this special person is under wraps. It may be recalled that Bandla Ganesh suprised one and all by inviting Ram Charan for the muhurat of Baadshah. If the reports are to be believed our dynamic producer requested his godfather Pawan Kalyan to attend the audio function of Baadshah.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X