For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్-సంపత్ నంది మూవీ టైటిల్ ఖరారైందా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ తో 'రచ్చ' చిత్రం చేసిన దర్శకుడు సంపత్ నందికి... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. అంతలోనే టైటిల్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి 'చోటా మేస్త్రీ' అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంభందించిన వర్క్ మొదలయిందని సంపత్ నందికి క్లోజ్ గా ఉండే వారు అంటున్నారు. అయితే పూర్తిగా ఓకే అయ్యేదాకా ప్రాజెక్టు వివరాలు బయిట పెట్టకూడదని సంపత్ ఎక్కడా ఈ మ్యాటర్ పై మాట్లాడటం లేదని,అందుకే మీడియాకు కూడా దొరకకుండా పూర్తిగా స్క్రిప్టుపై దృష్టి పెట్టాడని వినికిడి.

    ఈ చిత్రాన్ని పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. చాలా కాలంగా పవన్ కళ్యాణ్, శరద్ మరార్ పమంచి స్నేహితులు కావటంతో ఈ అవకాశం శరత్ మరార్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో తాను చేయబోయే చిత్రం అనంతరం ఈ చిత్రం ఉంటుంది.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈచిత్రంలో సమంత, ప్రణీత హీరోయిన్లు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Sampath Nandi has narrated the story to Pawan Kalyan and the Power Star who was impressed with his narration has okayed it in the single sitting. The film is likely to go on floors after Pawan completes Trivikram's project. Meanwhile several titles are doing rounds across social networking sites that the film has been titled as Chota Mesthri.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X