‘మనలో ఒక్కడు’గా పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సౌతిండిమా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారనే ప్రాచారం ఆ మధ్య జరిగిన విషయం తెలిసిందే. శంకర్ రూపొందించిన సూపర్ హిట్ మూవీ'ఒకే ఒక్కడు'కు రీమేక్‌గా దీన్ని రూపొందించనున్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
తాజాగా ఈచిత్రం మొదలు కాబోతోదంటూ....ఇంటర్నెట్లో ప్రాచారం జరుగుతోంది. 'మనలో ఒక్కడు' అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోందని, ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? అనే కథాంశంతో ఇది రూపొందుతోందని చెబుతూ ఓ పోస్టర్ కూడా దర్శనం ఇస్తోంది. ఈచిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారని, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, గణేష్ బాబు ప్రొడ్యూసర్ అంటూ అందులో పేర్కొన్నారు.
అయితే ఇదంతా కొందరు కావాలని చేస్తున్న ప్రచారమే అని, ఇప్పటి వరకు అలాంటి సినిమా ప్రతిపాదన రాలేదని పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ సన్నిహితులు అంటున్నారు. అయితే అభిమానులు మాత్రం ఇలాంటి సినిమా వస్తే బాగుండు, పవర్ స్టార్‌ను ముఖ్యమంత్రిగా తెరపై చూడాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్ ' చిత్రంలో నటిస్తున్నారు. మే 2వ వారంలో ఈచిత్రం విడుదల కాబోతోంది. ఈచిత్రం తర్వాత ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











