పవన్ కల్యాణ్ టైటిల్...'ప్రిన్స్ ఆఫ్ పీస్'
పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ కి ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే టైటిల్ ని నిర్ణయించినట్లు సమాచారం.జీసస్ క్రిస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నఆ చిత్రంలో పవన్ ఓ ఫిల్మ్ డైరక్టర్ గా కనపించనున్నారు. ఇక గతంలో బాలకృష్ణతో 'విజయేంద్రవర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ కొండా కృష్ణంరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. జెకె.భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మితమవుతుంది. దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పాత్రల కోసం 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికల్నే ఎంపిక చేసుకుని నటింపచేసారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్ సూత్రాల్ని పాటించారని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











