స్క్రిప్టు మొత్తం మార్చి తిరగరాయాలని పవన్ కళ్యాణ్ ఆదేశం!?
మిరపకాయ్ చిత్రంతో విజయం సాధించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తాజాగా గబ్బర్ సింగ్ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ గా రూపొందే ఈ చిత్రం లో స్క్రిప్టు పూర్తి స్ధాయి మార్పులు చేయమని దర్శకుడుని కోరినట్లు సమాచారం.మొదట ఉన్నది ఉన్నట్లుగా తీద్దామని ఫిక్స్ అయి వెర్షన్ రాయించినా తన ఫ్యాన్స్ కొందరు వచ్చి ఆ స్క్ర్రిప్టు యాజటీజ్ గా తీస్తే వర్కవుట్ కాదని,నేటివిటే సమస్య వస్తుందని చెప్పటంతో ఆలోచనలో పడిన పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.మిరపకాయ చిత్రం తో ఫన్ బాగా రాబట్టిన హరీష్ శంకర్ పై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పిన పవన్ ఈ చిత్రాన్ని కూడా పూర్తి పంచ్ డైలాగులో తన మార్కు స్టైల్స్ తో రూపొందించాలని పురమాయించాడని ఫిల్మ్ నగర్ సమాచారం.ఇక హరీష్ శంకర్ కూడా శక్తి వంచన లేకుండా గబ్బర్ సింగ్ ని కొత్త ఐడియాలతో సరికొత్తగా పునర్ నిర్మించే యోచనలో ఉన్నారు.అయితే స్క్రిప్టు మొత్తం మళ్ళీ పవన్ చెప్పినట్లు తిరగ రాయాలంటే మాత్రం మరి కొద్ది నెలలు పడుతుందని అంటున్నారు.ఎలా చేసినా సూపర్ హిట్టే కదా కావాల్సింది.దానికోసమే కదా అభిమానులు ఎదురు చూసేది.


Click it and Unblock the Notifications











