పవన్ అత్తారింటికి దారేది లీకెడ్ డైలాగ్స్

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాన్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో డైలాగులు అంటూ కొన్ని డైలాగులు బయిటకు వచ్చాయి. అయితే ఆ డైలాగులు సినిమాలోవా కాదా అన్నది తెలియాలంటే కొద్ది కాలం ఆగాలి.

ఆ డైలాగులు క్రింది విధంగా ఉన్నాయి.

ముఖేష్ రుషి : గౌతమ్ అడ్డులే...

పవన్ : ఇంత వైలెంట్ సిట్యువేషన్ లో కూడా సైలెంట్ గా ఉండటానికి నేను వివేకనందను కాదు గౌతమ్ నంద ..

ముఖేష్ రుషి : నీకు నా బ్యాక్ గ్రౌండ్ తెలియదు

పవన్ : హా..అంకుల్ .. గ్రౌండ్ లో దిగాక బ్యాక్ గ్రౌండ్ లకు భయపడే బాడీ కాదు ఇది, ఏ బాడీ అయినా కబ్బాడ్డీయే.... !!

గతంతోనూ కొన్ని డైలాుగుల లీకయ్యాయి. అవి మరోసారి....

ప్రణీత, పవన్ మధ్య డైలాగు
ప్రణీత: "నువ్వు ఐ మూలగా(డైయగ్నల్) అంటూ అమ్మాయిలకు ఏదో లెక్చర్ ఇస్తావంటగా....?"
పవన్: "అది అంతా అలాంటి అండర్ కలర్ బ్యూటీస్ కి బుజ్జీ...నువ్వు ఎటు చూసినా...ఎలా చూసినా పిల్లోడు నాశనం."

అలాగే పవన్ , అలీ మధ్య డైలాగు
అలీ - "ఈ పిల్ల ని బౌండరీ దాటించటం అంత ఈజీ కాదు, చాలా భారీ ఫీల్డింగ్ పెట్టాడు వాడు".
పవన్- "చూడమ్మా సింగిల్ కొట్టాలి అనుకున్నవాడే ఫీల్డర్ ని చూసి ఆడతాడు. నాలాగ సిక్స్ కొట్టాలి అని ఫిక్స్ అయిన వాడికి ఫీల్డర్ ఎక్కడున్న పెద్దగా ఏ ఫీలింగ్ ఉండదు ".

అరువు...నీకు ఓపికున్నంత వరకు...నీ వాయిస్ లో బేస్ ఉన్నంత వరకు ఎగురు...నీ కాళ్లలో సత్తా ఉన్నంత వరకు.. కానీ సూటిగా చూడకు...స్ట్రైట్‌గా రాకు... నా కళ్లలో పవర్ చూసి తట్టుకోలేవు. నా రూట్లో ఇమడలేవు నోట్లో మాట..గన్‌లో తూటా వెస్ట్‌‌గా ఉండకూడదు.. నోరు జారినా..తూటా పేలినా ప్రాణాలు పోతాయ్

ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన శుభం కార్డు సీన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టీవీయాంకర్ గాయిత్రి భార్గవి ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..'పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇది. ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అవుతుందని దాన్నే ఖరారు చేసాం' అన్నారు.

ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X