'పంజా'లో పవన్ క్యారెక్టరైజేషన్ ఏమిటి?

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'పంజా'. తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ దర్సకత్వంలో రూపొందున్న ఈ చిత్రం డిసెంబరు 9న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నిమిత్తం వదిలిన ప్రమోలు,టీజర్స్,పోస్టర్స్ అందరిలో ఓ రకమైన క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. పవన్ గడ్డంతో రఫ్ గా కనిపిస్తున్న గెటప్ కి సినిమాలో అస్సలు క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేది అబిమానులు సందేహం..తెలిసిన సమాచారం ప్రకారం..ఇందులో పవన్ మాఫియాలో పనిచేస్తూంటాడు.అతని క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా చాలా గంబీరంగా ఉంటుంది. అతన్ని పైనుంచి చూసిన వారికి ఓ సముద్రం చూసిన ఫీలింగ్ వస్తుంది. అతనికి ఈ సమాజంతో సంభందం లేనట్లుగా అనిపిస్తాడు. అయితే కదిలిస్తే... కాసేపు మాట్లాడితే, స్నేహం చేస్తే... ప్రాణాలివ్వడానికైనా సిద్ధమవుతాడు. ఒక్కోసారి మౌనంగా తన పని తాను చేసుకుపోతాడు. మరోసారి మనకు మాట్లాడడానికి అవకాశమే ఇవ్వడు. అలాంటి డిఫెరెంట్ వ్యక్తిత్వం ఉన్న మనిషి కథే పంజా.

ఇక ఈ చిత్రంలో సారాజేన్‌ డయాస్‌, అంజలీ లావనియా హీరోయిన్స్ . నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ నిర్మాతలు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వస్తోంది. పవన్‌ గాంభీర్యం చూసి ఇదేదో సీరియస్‌గా సాగే కథ అనుకోవద్దు. పవన్‌ శైలి వినోదం కూడా ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మానందంతో ఆయన పండించిన హాస్యం అందరికీ నచ్చుతుంది. పవన్‌ని ఓ కొత్త కోణంలో చూపించాలనుకొన్న మా లక్ష్యం నెరవేరింది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X