హాట్ టాపిక్: బాబాయ్, అబ్బాయ్ మెగా మల్టీస్టారర్?
హైదరాబాద్: గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీలో పరిస్థితులు కాస్త తేడాగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మెగా స్టార్, పవర్ స్టార్ మధ్య సఖ్యత లేదని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పలు సందర్భాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ వార్తలను కొట్టి పారేస్తూ వస్తున్నారు.
అయితే రామ్ చరణ్ ఎంత చెబుతున్నప్పటికీ, ఆయన మాటలు ఎవరినీ సంతృప్తి పరచడం లేదనేది అభిమానులు, మరికొందరి వాదన. అయితే ఈ సారి పవన్, రామ్ చరణ్ మాటలతో కాకుండా చేతలకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లోనూ మల్టీస్టారర్ సినిమలకు క్రేజ్ పెరుగుతుందనడం కూడా వీరి నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఒకరకంగా ఈ విషయం మెగా అభిమానులకు ఊరటనిచ్చే విషయమే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ రూపొందబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే ఓ కథను సిద్దం చేసాడని, ఇద్దరికీ పర్ ఫెక్టుగా సూటయ్యే విధంగా ఈ స్టోరీ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో నటించడానికి పవన్ ఇప్పటికే పచ్చజెండా ఊపాడని వార్తలు ఊపందుకున్నాయి. ఈ బాబాయ్, అబ్బాయిల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు భగవాన్, పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తారని అంటున్నారు. నిజా నిజాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











