పవన్ గెడ్డం గీసుకుంటే...ఇంత గోలా?
హైదరాబాద్ :"నేను సింహం లాంటోండిని...అది గెడ్డం గీసుకోలేదు..నేను గీసుకోగలను..అంతే తేడా" అంటాడు అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్. ఆ డైలాగు అప్పుడు సూపర్ హిట్. ఇప్పుడు పవన్ గెడ్డం గీసుకోవటమూ సూపర్ హిట్టే. తాజాగా ఆయన గెడ్డం గీసుకోవటం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయింది. తన అభిమాన నాయకుడు చేగువేరాని గుర్తుచేసేలా గెడ్డం పెంచుకున్న పవన్ ..ఎలక్షన్ అయిపోగానే గెడ్డం గీసేసారు. అయితే గెటప్ ఛేంజ్ చేసేసారు...ఆ వేషం ముగిసింది అంటూ వ్యంగ్యపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
గత కొంతకాలంగా హీరో పవన్‌కల్యాణ్ ఆహార్యం. జనసేన అధ్యక్షుడిగా చంద్రబాబుకు, మోదీకి మద్దతిచ్చిన నాయకుడిగా తెలంగాణలో.. సీమాంధ్రలో ఎన్నికల ప్రచారంలో గెడ్డం తో కూడిన ఆహార్యంతో కనిపించిన పవన్‌కల్యాణ్ ఎన్నికలు ముగియగానే గెడ్డం గీసేసారు. ఆయన తన తదుపరి చిత్రాలు కోసం రెడీ అవుతున్న నేపధ్యంలో ఈ గెడ్డం పెద్ద విశేషం అయి కూర్చుంది.

గడ్డం తీసేసి, హెయిర్ కట్‌చేయించుకొని, కలర్ వేయించుకొని కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌తో మునుపటి గ్లామర్‌తో దర్శనమిచ్చాడు. గురువారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పవన్‌ను తన నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు . అక్కడే పవన్ ఇలా కనిపించాడు. ఇక త్వరలో ప్రారంభం కానున్న గబ్బర్‌సింగ్-2 సినిమా చిత్రీకరణలోపాల్గొనడానికే పవన్ ఇలా న్యూగెటప్‌లోకి మారిపోయాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తెలంగాణ, సీమాంధ్రలో సుడిగాలి పర్యటన జరిపిన పవన్ కళ్యాణ్ ఒకింత అలసిపోయారనే చెప్పవచ్చు. ఆయన రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ నెల 16వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అప్పటి వరకు ఆయన విశ్రాంతి తీసుకుంటారు. ఫలితాల అనంతరం ఆతను సినిమాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారట. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో గడపనున్నారు.


Click it and Unblock the Notifications











