'కెమెరామేన్ గంగతో..' ఆడియో వాయిదా?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం ఆడియోని మొదట ఈ నెల 21న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వలన ఈ తేదీని కొంచెం ముందుకు జరిపి అంటే ఈ నెల 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. గెస్ట్ గా అనుకున్న చిరంజీవి ఆ రోజు బిజీగా ఉండటంతో చివరి నిముషంలో ఈ మార్పు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. అయితే దీనిపై నిర్మాతలు అధికారికంగా ఏమీ తెలియచేయలేదు.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ని గ్రాండ్ జరపాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి పవన్ అన్నగారైన చిరంజీవి ఛీప్ గెస్ట్ గా రానున్నారు. గబ్బర్ సింగ్ తర్వతా అన్నదమ్ములు ఇద్దరు మళ్లీ ఒకే స్టేజిపై కనపడనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. బాబా సెహగల్.. పవనిజం పై పాడిన పాటను కూడా ఈ చిత్రం ట్రాక్ లో కలుపుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం హైలెట్ కానుంది.'గబ్బర్‌సింగ్' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్ సినిమాగా బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications











