'పంజా'నిర్మాతలపై ఫ్యాన్స్ ఆగ్రహం
పవన్ కళ్యాణ్ పంజా మొన్న శుక్రవారం మంచి ఓపినింగ్స్ తో విడుదలైంది. రిలీజైన మొదటి షోకు నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో రికార్డులనే క్రియేట్ చేసింది. దాదాపు 33కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజు వసూళ్ల పరంగా వరల్డ్ వైడ్ గా దాదాపు 16.2కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ట్రేడ్ వర్గాలు చెప్తున్న ఈ కలెక్షన్స్ ని నిర్మాతలు మాత్రం అఫీషియల్ గా ప్రకటించలేదు. అయితే దూకుడు,ఊసరవెల్లి తరహాలో ఈ కలెక్షన్స్ ని నిర్మాతలు ప్రకటిస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
తమ హీరో కలెక్షన్స్ ని అఫీషయల్ గా ప్రకటిస్తే తాము గర్వంగా చెప్పుకునేందుకు అవకాశముంటుందని భావిస్తున్నారు. ఇక ఈ మధ్యన దూకుడు,మగధీర చిత్రాల కలెక్షన్స్ మధ్య గొడవలు జరిగిన నేపధ్యంలో ఈ అవకాశాన్ని మెగా ఫ్యాన్స్ వదులుకోకూడదని భావిస్తున్నారు. తమ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఓ రేంజి కలెక్షన్స్ రావటం అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. వీకెండ్ లలో సైతం పంజా కలెక్షన్స్ హవా కొనసాగుతున్నాయి. ఇదే రేంజిలో అవి వస్తే...కొత్త రికార్డులు క్రియేట్ చేయటం ఖాయం అంటున్నారు. మరి నిర్మాతలు..అభిమానుల కోసమైనా అఫీషయల్ గా ఇప్పటికైనా కలెక్షన్స్ ప్రకటిస్తే బావుంటుంది.


Click it and Unblock the Notifications











