‘గబ్బర్ సింగ్’ నిర్మాతపై పవన్ ఫ్యాన్స్ గరం
హరీష్ శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మించిన 'గబ్బర్‌సింగ్' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 50 డేస్ ఫంక్షన్ ఘనంగా జరపాలని గణేష్ ప్లాన్ చేస్తున్నరంటూ వార్తలు వచ్చాయి. అలాగే ఆ ఉత్సావానికి పవన్ కళ్యాణ్ హాజరవ్వటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సైతం మీడియాలో వినిపించింది. అయితే యాభై రోజుల పూర్తి చేసుకుని పది రోజులు పైగా అవుతున్నా ఎక్కడా ఆ పంక్షన్ కి సంభందించి గణేష్ బాబు ప్రకటన చేయలేదు.
యాభై రోజులు పూర్తైన సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ బాబు మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' రాకతో మునుపటి రికార్డులన్నీ ఎగిరిపోయాయి. మా సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నా మా హీరో అలాంటివేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటున్నారు. ఆయన వీటిని పట్టించుకోర ని అన్నారు. త్వరలో ఈ సినిమా విజయోత్సవాన్ని భారీ ఎత్తున చేయబోతున్నాం. ఆ సందర్భంగా ఈ సినిమాని పైరసీ నుంచి కాపాడిన అభిమానులకు సన్మానం చేస్తాం అని చెప్పారు. అయితే ఇప్పటివరకూ ఏ వివరాలు తెలియచేయలేదు.
దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ హీరో పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రేంజి హిట్ రావటంతో ఆ ఉత్సవం గురించి ఊసెత్తపోవటం చాలా మందిని నిరాసపరుస్తోంది. ఈ లోపుల ఏమన్నా ప్లాన్స్ మారాయో.. వాటిని మీడియా ముఖంగా తెలియచేస్తే బాగుంటుందని అంటున్నారు. మొదట ఈ పంక్షన్ ని లో ప్రొఫైల్ లో వైజాగ్ లో వివి వినాయిక్ ధియోటర్ లో చేద్దామని ప్లాన్ చేసారు. అయితే హరీష్ శంకర్,గణేష్ బాబు కలిసి పట్టుబట్టి పవన్ ని ఒఫ్పించారని చెప్పారు. దాంతో ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకన్నారు. ఆ పంక్షన్ ఎక్కడ,ఎప్పుడు జరిగేది త్వరలోనే మీడియాకు తెలియచేస్తామని అన్నా దానిపై ఏ వివరణా రావటం లేదు.
గణేశ్ తీసిన తొలి రెండు చిత్రాలు సరిగా ఆడకపోవడంతో ఆయనను అపహాస్యం చేసినవాళ్లకు 'గబ్బర్ సింగ్' రికార్డులే సమాధానం అని హరీష్ శంకర్ చెప్పారు. గబ్బర్ సింగ్ రికార్డు కలెక్షన్స్ తో దూసుకు పోతున్న నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. గతంలో గణేష్ చేసిన తీన్ మార్,ఆంజనేయులు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. దాంతో అంతా గణేష్ ని ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్ అన్నారు. అయితే గబ్బర్ సింగ్ చిత్రం గణేష్ ని ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాతను చేసింది అన్నారు.


Click it and Unblock the Notifications











