'ఖుషీ' సెంటిమెంట్ తో 'గబ్బర్ సింగ్' ని..
పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ చిత్రం ఖుషీ. ఆ తర్వాత ఎన్ని చిత్రాలు వచ్చినా ఆ చిత్రం హిట్ రేంజిని పొందలేకపోయాయి. దాంతో ఇప్పుడు గబ్బర్ సింగ్ తో అలాంటి హిట్ ని పవన్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయన ఆ చిత్రం విడుదల తేదిని ఖుషీ చిత్రం విడుదల తేదీనే ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రియల్ 27, 2012 న గబ్బర్ సింగ్ ని విడుదల చేసి ఖుషీ సెంటిమెంట్ ని ఫాలో అవ్వాలనుకుంటున్నట్లు చెప్తున్నారు. ఖుషీ చిత్రం ఏప్రియల్ 27,2001 న విడుదలైంది. ఇక పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ చాలా స్టైలిష్ గా పంచ్ డైలాగులో అదరకొట్టి తన అబిమానులను ఆనందింపచేస్తాడని తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కంటిన్యూగా యాభై రోజుల షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ లో మాగ్జిమం టాకీ పార్ట్ అవకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని ఒప్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటల రికార్టింగ్ పూర్తి చేసారు. ఇక దబాంగ్ రీమేక్ గా రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు.. ఎట్టి పరిస్దితుల్లోనూ అనుకున్న తేదీకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











