పంజా రిజల్ట్ కి ఉదయ్ కిరణ్, ప్రియమణి హ్యాపీ?!
పవన్ పంజా దెబ్బకు చాలా సినిమాలు అవుటైపోతాయని అంతా భావించారు. అయితే పరిస్ధితి రివర్స్ అయ్యింది. సినిమా రిజల్ట్ నెగటివ్ గా రావటంతో ఈ సినిమా దెబ్బకు కుదేలైపోతాయనుకున్న వాళ్లంతా ఊపరిపీల్చుకుంటున్నారు. ఇక పంజా దెబ్బకు ఇబ్బందిపడుతాయనుకున్న చిత్రాలు డిసెంబర్ 16న విడుదల పెట్టుకున్నవి. అవి ప్రియమణి చిత్రం క్షేత్రం, టామ్ క్రూయిజ్ మిషన్ ఇంపాజబుల్ 4, ఉదయ్ కిరణ్ నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, జర్నీ, రతి నిర్వేదం, దునియా, దెయ్యం ఉందా, వన కన్య వండర్ వీరుడు. వీళ్లంతా తమ చిత్రాలు విడుదలకు పంజా అడ్డం కాదని ఇప్పుడు భావిస్తున్నట్లు వినపడుతోంది. ఈ చిన్న చిత్రాలు ఇప్పుడు విడుదల కాకపోతే సంక్రాంతి సీజన్ లో అస్సలు కుదరదు. సంక్రాంతి దాటితే మళ్లీ పిల్లల పరీక్షలు వచ్చేస్తాయి.
వేసవి వరకూ వెయిట్ చేయాలి. పెద్ద సినిమాలు అయితే ఇబ్బంది లేదు కానీ చిన్న సినిమాలకు ఫైనాన్స్ తరహా సమస్యలు బోలెడు. వారంతా వేరే దారిలేక పంజా విడుదల తర్వాత తమ రిలీజ్ లు పెట్టుకుని భయంభయంగా చూస్తున్నారు. దానికి తోడు ప్రియడు,సోలో,శ్రీరామ రాజ్యం,బెజవాడ, డర్టీ పిక్చర్ వంటి ఇప్పటికే విడుదలైన చిత్రాలకు కూడా పంజా వేటు పడుతుందని భావించారు. అయితే ఆ ఇంపాక్ట్ కనపడటం లేదు. వారు కూడా సేఫ్ అని భావిస్తున్నారు. పంజా చిత్రం ధియోటర్స్ రెండో వారంలో తగ్గితే తమకు ధియోటర్స్ సమస్య ఉండదనేది వారి ఆలోచన.


Click it and Unblock the Notifications











