ఆ హామీ ఇచ్చే గణేష్ కి పవన్ ‘గబ్బర్ సింగ్’ని అప్పచెప్పాడు
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయనున్న 'గబ్బర్ సింగ్"చిత్రానికి నిర్మాతగా గణేష్ ని ప్రకటిస్తూ అఫీషియల్ గా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మొదట పవన్ కల్యాణ్ స్వయంగా నిర్మిచాలని ప్లాన్ చేసారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు గణేష్ బాబుని సీన్ లోకి తేవటంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. హఠాత్తుగా ఈ మార్పుకు కారణం..తీన్ మార్ ఊహించిన విధంగా కలెక్షన్స్ వసూలు చేయకపోవటమేనని చెప్తున్నారు. దానికి కాంపన్షేషన్ గా గణేష్ కు ఈ ప్రాజెక్టు అప్పచెప్పాడని చెప్తున్నారు. నిజానికి తీన్ మార్ కి బొత్సా నిర్మాత కావటం, ఆ సినిమా నిరాశపరచటంతో గణేష్ కి పెద్దగా ఏమీ వర్కవుట్ కాలేదని, అందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. అంతేగాక తీన్ మార్ లో తాను పూర్తిగా ఇన్వాల్స్ అవటం కూడా కొంత వరకూ దెబ్బకొట్టిందని అదీ గణేష్ కెరీర్ పై పడకూడని పవన్ భావిస్తున్నాడని చెప్తున్నారు. అందుకే ఈ సారి గబ్బర్ సింగ్ లో తాను ఏ విషయంలోనూ కలగచేసుకోనని ఎలాగయినా హిట్ కొట్టాలని పవన్ చెప్పి మరీ ఈ ప్రాజెక్టు అప్పచెప్పారని చెప్పుకుంటున్నారు.
బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ గా 'గబ్బర్ సింగ్" చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై గణేష్‌బాబు మాట్లాడుతూ "నా మీద అభిమానంతో వెంటనే మా బేనర్‌లో రెండో సినిమాకి డేట్స్ ఇచ్చిన పవన్‌కళ్యాణ్ గారికి రుణపడి వుంటాను. పవర్‌స్టార్‌తో వెంటనే రెండవ సినిమా తీసే అవకాశం దక్కినందుకు సంతోషంగా వుంది. హిందీలో సెన్సేషనల్ హిట్ అయిన 'దబాంగ్" ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తున్నాం. పవన్‌కళ్యాణ్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే అంశాలతో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించే ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఓ ప్రముఖ హీరోయిన్ కథానాయికగా ఉంటారు. 'మిరపకాయ్" వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్" చిత్రాన్ని, పెద్ద హిట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











