»   » కాపీ టీజర్ పవన్ కి తెగ నచ్చేసింది...రీమేక్ కోసం

కాపీ టీజర్ పవన్ కి తెగ నచ్చేసింది...రీమేక్ కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ దృష్టి అంతా ఇప్పుడు రీమేక్ ల మీద ఉంది. తమిళ, హిందీ భాషల్లో ఏదన్నా కొత్త ప్రాజెక్టు కు రిలీజైనా లేక టీజర్స్ వచ్చినా ఆయనకు సంభందించిన వారు అది బాగుంటే వెంటనే ఆయన వద్దకు విషయం చేరవేస్తున్న్టట్లు సమాచారం. ఆయన కూడా దాన్ని పరీశీలించి రీమేక్ చేయటానికి ఏమన్నా ఉపయోగపడుతుందా అని డిస్కషన్ చేస్తున్నట్లు చెప్పుకుంటన్నారు.

Pawan is in awe of Theri teaser

అలా రీసెంట్ గా పవన్ కు బాగా నచ్చిన టీజర్ ..తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతోన్న ధేరి అని తెలుస్తోంది. గతంలో విజయ్ చేసిన ఖుషి, అన్నవరం వంటి చిత్రాలు తమిళంలో విజయ్ చేసినవే. అవి ఇక్కడ మంచి విజయం సాధించాయి. దాంతో ఆయన ధేరీ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు, ఆ చిత్రం అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.

ముఖ్యంగా ధేరీ టీజర్ లోని ఎండ్ షాట్..పవన్ చేసిన గబ్బర్ సింగ్ లోని అత్యాక్షరిని పోలి ఉండటంతో ఈ టాపిక్ పవన్ వద్ద వచ్చిందంటున్నారు. సర్దార్ బిజీలో ఉన్న పవన్ ...ఈ సినిమాకు సంభందించిన పూర్తి డిటేల్స్ తెలుసుకుని అన్నీ నచ్చితే రీమేక్ రైట్స్ తీసుకునే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు.

Pawan is in awe of Theri teaser

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్స్ ద్వారా ఇప్పటికే క్రేజ్ వచ్చింది. దాంతో బిజినెస్ కూడా ఊపందుకుంది. ఈ సినిమాలో పవన్ మరోసారి గబ్బర్ సింగ్ పాత్రలో అలరించనున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో రాయ్ లక్ష్మి, సంజన కీలక పాత్రల్లో కనపడనున్నారు.

తాజాగా ఈ సినిమాలో పవన్‌కి సంబంధించి మరో స్టిల్ విడుదల చేశారు సర్దార్ టీం. ఈ పోస్టరే మీరు ఇక్కడ చూస్తున్నది. నార్త్ ఎంటర్టైన్మెంట్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలపై శరత్ మరార్, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌లో తెరమీదికి రానున్న ఈ సినిమా ఆడియో మార్చి‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

English summary
Pawan is in awe of "Theri" teaser and his team approached hero Vijay to discuss about remake rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu